Tiger3: ట‌వ‌ల్ ఫైట్‌.. ఇప్ప‌టివ‌ర‌కు ఇండియ‌న్ సిల్వ‌ర్ స్క్రీన్‌పై రాలేదు: క‌త్రినా కైఫ్‌

ABN , First Publish Date - 2023-11-06T19:09:35+05:30 IST

బాలీవుడ్ మెగాస్టార్ స‌ల్మాన్ ఖాన్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన లేటెస్ట్ స్పై థ్రిల్లర్ సినిమా ‘టైగర్ 3’. స్పై యూనివర్స్‌లో గ‌త రెండు చిత్రాల్లో తొలి మహిళా స్పైగా మెప్పించిన‌ కత్రినా కైఫ్ మరోసారి టైగర్ 3 చిత్రంలో వామ్మో అనేలా అద్భుతమైన యాక్ష‌న్ స‌న్నివేశాల్లో న‌టించింది. ట‌ర్కీ హ‌మామ్‌లో క‌త్రినా కైఫ్‌పై చిత్రీక‌రించిన ట‌వ‌ల్ ఫైట్ ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్‌గా మారింది.

Tiger3: ట‌వ‌ల్ ఫైట్‌.. ఇప్ప‌టివ‌ర‌కు ఇండియ‌న్ సిల్వ‌ర్ స్క్రీన్‌పై రాలేదు: క‌త్రినా  కైఫ్‌
katrina kaif

బాలీవుడ్ మెగాస్టార్ స‌ల్మాన్ ఖాన్ (Salman Khan) టైటిల్ పాత్ర‌లో న‌టించిన లేటెస్ట్ స్పై థ్రిల్లర్ సినిమా ‘టైగర్ 3’(Tiger3). ఆయ‌నకు జోడీగా క‌త్రినా కైఫ్ న‌టించింది. ఇమ్రాన్ హ‌స్మీ(Emraan Hashmi) ప్ర‌తి నాయ‌కుడిగా న‌టించాడు. యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా వ‌స్తున్న ఈ చిత్రానికి మ‌నీష్ శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా ఆదిత్య చోప్రా నిర్మించారు. దీపావ‌ళి సంద‌ర్భంగా న‌వంబ‌ర్ 12న హిందీ, తెలుగు, త‌మిళ భాష‌ల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతుంది. స్పై యూనివర్స్‌లో గ‌త రెండు చిత్రాల్లో తొలి మహిళా స్పైగా మెప్పించిన‌ కత్రినా కైఫ్ (Katrina Kaif) మరోసారి టైగర్ 3 చిత్రంలో వామ్మో అనేలా అద్భుతమైన యాక్ష‌న్ స‌న్నివేశాల్లో న‌టించింది.

tiger3.jpg

ట‌ర్కీ హ‌మామ్‌లో క‌త్రినా కైఫ్‌పై చిత్రీక‌రించిన ట‌వ‌ల్ ఫైట్ ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్‌గా మారింది. త‌రుచూ హీరోలు మాత్ర‌మే చేసే ఫైట్ సీక్వెన్స్‌ల‌లో హీరోయిన్ కూడా ఎంత గొప్ప‌గా న‌టించ‌గ‌ల‌దో క‌త్రినా ఇందులో చూపించారు. ఈ సంద‌ర్భంగా క‌త్రినా కైఫ్(Katrina Kaif) మాట్లాడుతూ అంద‌రూ మెచ్చుకునేలా రిస్క్‌తో కూడిన యాక్ష‌న్ స‌న్నివేశాల్లో న‌టించ‌టాన్ని నేనెంతో ఇష్ట ప‌డి క‌ష్ట ప‌డి చేశాను. టైగ‌ర్ ఫ్రాంచైజీ చిత్రాల్లో నాకు మ‌ర‌చిపోలేని గొప్ప అనుభూతులు ఉన్నాయి. ఓ యాక్ష‌న్ హీరోయిన్‌గా నాలోని టాలెంట్‌ను ఈ చిత్రాలు న‌న్ను గొప్ప‌గా ఆవిష్క‌రించాయి. టైగ‌ర్‌3లో జోయా అనే స్పైగా న‌టించాను. టైగ‌ర్‌లాగా ఎవ‌రినైనా ఎదిరించ‌ట‌మే కాక‌ తుది వ‌ర‌కు నిల‌బ‌డి, పురుషుల‌తో స‌మానంగా పోరాడే ఓ మ‌హిళ‌గా న‌న్ను ఆడియెన్స్ చూస్తారని అన్నారు. Tiger3


ఇక హమామ్‌లో చిత్రీక‌రించిన ట‌వ‌ల్ ఫైట్ ఇంట‌ర్నెట్‌లో వీప‌రీతంగా వైర‌ల్ అయ్యింది. అయితే ఆ ఫైట్‌ను ఎంతో క‌ష్ట‌ప‌డి చిత్ర‌క‌రించాం. ఎందుకంటే వేడి నీటి ఆవిరుల‌తో నిండిన గ‌దిలో పోటాపోటీగా సాగే ఫైట్ ఇది. దీన్ని గ్రిప్పింగ్ కిక్స్‌, పంచ్‌ల‌తో చేయ‌టం ఎంతో క‌ష్టంతో కూడుకున్నది. ఇద్ద‌రు మ‌హిళ‌లు ఇలా నువ్వా నేనా అనేంత‌గా పోరాడే ఫైట్ సీన్ ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియ‌న్ సిల్వ‌ర్ స్క్రీన్‌పై రాలేదని తెలిపింది. ఇలాంటి ఆలోచ‌న చేసిన ఆదికి, డైరెక్ట‌ర్ మ‌నీష్‌, యాక్ష‌న్ టీమ్ ఈ ఫైట్ సీన్‌ను ప్లానింగ్‌తో చిత్రీక‌రించిన విధానానికి హ్యాట్సాఫ్ అని చూసే వారంద‌రికీ న‌చ్చుతుందని పేర్కొంది.

ఇందులో ట‌వ‌ల్ ఫైట్‌లో నాతో మిచెల్ లీ న‌టించింద‌ని, మా మ‌ధ్య జ‌రిగే ఈ ఫైట్ సీన్ ప్రేక్ష‌కులంద‌రినీ మెప్పిస్తుంద‌ని భావిస్తున్నాను. ఇప్ప‌టివ‌ర‌కు చాలా మంది మ‌హిళ‌లు తెర‌పై యాక్ష‌న్ సీక్వెన్స్‌లో న‌టించ‌గా వాటిలో కొన్ని మాత్ర‌మే బెస్ట్‌గా నిలిచాయని, ఇక‌పై ఈ సినిమాలోని ఫైట్స్ కూడా వాటిలో నిలుస్తాయ‌ని తెలిపింది. దీనికి ప్రేక్ష‌కులు ఎలా స్పందిస్తారో చూడాల‌ని నేను ఆతృత‌గా ఎదురు చూస్తున్నానని స్ప‌ష్టం చేసింది.

Updated Date - 2023-11-06T19:10:55+05:30 IST