Sanakhan: కల్యాణ్‌రామ్‌ హీరోయిన్‌ తల్లయింది!

ABN , First Publish Date - 2023-07-06T17:33:10+05:30 IST

హీరోయిన్‌ సనాఖాన్‌ పండండి మగబిడ్డకు జన్మనిచ్చింది. కల్యాణ్‌ రామ్‌ నటించిన ‘కత్తి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బాలీవుడ్‌ బ్యూటీ తల్లి అయినట్లు తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. ‘మీ అందరూ మాపై ప్రేమాభిమానాలు చూపుతున్నందుకు ధన్యవాదాలు. మీ దీవెనలు మా బిడ్డకు కూడా కావాలి’’ అని కోరింది.

Sanakhan: కల్యాణ్‌రామ్‌ హీరోయిన్‌ తల్లయింది!

హీరోయిన్‌ సనాఖాన్‌ (Sana khan) పండండి మగబిడ్డకు జన్మనిచ్చింది. కల్యాణ్‌ రామ్‌ (Kalyan Ram) నటించిన ‘కత్తి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బాలీవుడ్‌ బ్యూటీ తల్లి అయినట్లు తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. ‘మీ అందరూ మాపై ప్రేమాభిమానాలు చూపుతున్నందుకు ధన్యవాదాలు. మీ దీవెనలు మా బిడ్డకు కూడా కావాలి’’ అని కోరింది. ఆమెకు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. 2005లో బాలీవుడ్‌లో హీరోయిన్‌గా అడుగుపెట్టిన ఖాన్‌ ‘కల్యాణ్‌రామ్‌ కత్తి’ చిత్రంతో తెలుగులోకి హీరోయిన్‌గా పరిచయం అయింది. తదుపరి హిందీ, తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో నటించింది. నాగార్జున నటించిన ‘గగనం’, మంచు మనోజ్‌ హీరోగా తెరకెక్కిన ‘మిస్టర్‌ నూకయ్య’ చిత్రాలతో మెప్పించింది. హిందీ బిగ్‌బాస్‌ 6, 7 సీజన్‌లలో కంటెస్టెంట్‌గా అవకాశం అందుకొంది. 2019లో అయోగ్య అనే చిత్రంలో నటించిన ఆమె ఆ తర్వాత సినిమాలకు గుడ్‌ బై చెప్పేసింది. 2020లో సూరత్‌కు చెందిన అనాస్‌ సయ్యద్‌ని పెళ్లి చేసుకుంది.

Updated Date - 2023-07-06T17:33:10+05:30 IST