Karan Johar: బాలీవుడ్ కంటే టాలీవుడే లాభదాయకమైంది

ABN , First Publish Date - 2023-01-06T15:37:46+05:30 IST

బాలీవుడ్‌లో మంచి పాపులారిటీ ఉన్న దర్శక నిర్మాత కరణ్‌ జోహార్ (Karan Johar). ఎక్కువగా లవ్ స్టోరీల (Love Stories)ని డైరెక్ట్ చేసి మంచి విజయాలను అందుకున్న కరణ్ జోహార్..

Karan Johar: బాలీవుడ్ కంటే టాలీవుడే లాభదాయకమైంది
Karan Johar

బాలీవుడ్‌లో మంచి పాపులారిటీ ఉన్న దర్శక నిర్మాత కరణ్‌ జోహార్ (Karan Johar). ఎక్కువగా లవ్ స్టోరీల (Love Stories)ని డైరెక్ట్ చేసి మంచి విజయాలను అందుకున్న కరణ్ జోహార్.. మరోవైపు సినిమాలను నిర్మిస్తూ సక్సెస్‌ఫుల్ నిర్మాతగా కొనసాగుతున్నాడు. అయితే.. నెపోటిజాన్ని ఎంకరేజ్ చేస్తాడనే విమర్శ కరణ్‌పై ఉంది. అంతేకాకుండా చాలా విషయాలపై ముక్కుసూటిగా మాట్లాడుతూ విమర్శల పాలవుతూ ఉంటాడు. ఈ దర్శకుడు తాజాగా బాలీవుడ్ (Bollywood), టాలీవుడ్ (Tollywood) చిత్ర పరిశ్రమలను పోల్చుతూ కామెంట్స్ చేశాడు.

కరణ్ ఇటీవలే మాస్టర్స్ యూనియన్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడాడు. అందులో.. ‘‘సినిమా ఎప్పుడు ఫెయిల్ కాదు, బడ్జెట్ మాత్రమే అవుతుందని నేను నిర్మాణ రంగంలోకి ప్రవేశించిన కొత్తలో యశ్ చోప్రా నాతో చెప్పాడు. ఈ విషయాన్ని నిజ జీవితంలో ‘స్టూడెంట్ ఆఫ్ ది ఈయర్’ సినిమాకి ఎక్స్‌పీరియన్స్ చేశాను. దానికి నేను ఓ హిట్ సినిమా తీసి.. నా డబ్బుని పొగొట్టుకున్నాను. ఆ సమయంలో దాదాపు ప్రతి రోజు నిద్రపోవడానికి ఓ మాత్ర వేసుకున్నా’ అని చెప్పుకొచ్చాడు.

కరణ్ ఇంకా మాట్లాడుతూ.. ‘నాకు చాలా ఎమోషన్ ఉంది. నా హృదయం, ఇంట్రస్ట్ హిందీ సినిమాపై ఉంది. కానీ మీరు నన్ను అడిగితే, ఒక వ్యాపారవేత్తగా.. బాలీవుడ్ కంటే తెలుగు చాలా లాభదాయకమైన చిత్ర పరిశ్రమ అని చెబుతాను’ అని తెలిపాడు.

అలాగే చిత్ర పరిశ్రమలో డబ్బు సంపాదన గురించి కూడా కరణ్ మాట్లాడాడు. ‘దురదృష్టవశాత్తూ.. నిర్మాత డబ్బులో ఎక్కువ భాగం సినీ తారల వద్దకు వెళుతోంది. ఇలా చెప్పినందుకు వారు నన్ను హత్య చేసిన చేయొచ్చు. కానీ ఐదు కోట్ల ఓపెనింగ్ కూడా తీసురాలేని హీరోలు సైతం రూ.20 కోట్ల రెమ్యూనరేషన్ అడుగుతున్నారు. అది ఎంతవరకు న్యాయం?’ అని కరణ్ ప్రశ్నించాడు. కాగా కరణ్ ప్రస్తుతం రణ్‌వీర్ సింగ్, ఆలియా భట్ జంటగా.. ‘రాఖీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహనీ’ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

Updated Date - 2023-01-06T15:42:17+05:30 IST