Kangana Ranaut: ఎలాన్ మస్క్‌ని కాపీ కొడుతున్నావా?.. ఫేస్‌బుక్ బాస్‌పై బాలీవుడ్ బ్యూటీ సెటైర్లు

ABN , First Publish Date - 2023-02-20T15:02:14+05:30 IST

సినీ పరిశ్రమలో ఎటువంటి సపోర్టు లేకుండా టాప్ హీరోయిన్‌గా ఎదిగిన నటీమణుల్లో కంగనా రనౌత్ (Kangana Ranaut) ఒకరు

Kangana Ranaut: ఎలాన్ మస్క్‌ని కాపీ కొడుతున్నావా?.. ఫేస్‌బుక్ బాస్‌పై బాలీవుడ్ బ్యూటీ సెటైర్లు
Kangana Ranaut

సినీ పరిశ్రమలో ఎటువంటి సపోర్టు లేకుండా టాప్ హీరోయిన్‌గా ఎదిగిన నటీమణుల్లో కంగనా రనౌత్ (Kangana Ranaut) ఒకరు. వరుసగా ప్రాధాన్యం ఉన్న పాత్రలు, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూ కెరీర్‌లో దూసుకెళుతోంది. అయితే ఈ భామ ఏ విషయం మీదైనా ఎటువంటి బెరుకు లేకుండా మాట్లాడుతుంటుంది. దాని వల్ల కొన్నిసార్లు వివాదాల్లో సైతం ఇరుక్కుంటూ ఉంటుంది. అయినా అవేవీ పట్టించుకోకుండా తన ధోరణిలో వెళుతూ ఉంటుంది. తాజాగా ఫెస్‌బుక్ Facebook), వాట్సాప్ (Whatsapp) మాతృసంస్థ మెటా కంపెనీ బాస్‌ మార్క్ జుకర్ బర్గ్ (Mark Zuckerberg)పై సోషల్ మీడియా వేదికగా ఈ భామ సెటైర్లు వేసింది.

గత కొన్నినెలల క్రితం ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆ సంస్థలో ఎన్నో మార్పులు చేశాడు. ఈ తరుణంలోనే సెలబ్రిటీలకు ఇచ్చే బ్లూ టిక్ కోసం నెలకి 8 డాలర్లు ఛార్జీ చేయనున్నట్లు ప్రకటించాడు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రముఖుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. అయినా ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఈ తరుణంలో మెటా బాస్ జుకర్ బర్గ్ కూడా అలాంటి నిర్ణయమే తీసుకున్నాడు.

ఇది కూడా చదవండి: Tips to Healthy hair: ఖర్చు లేకుండా అందమైన కురులు కావాలా.. సలహాలు ఇచ్చిన ‘సాహో’ భామ..

త్వరలో మెటా సబ్‌స్క్రిప్షన్ అనే కొత్త ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు జుకర్ బర్గ్ తెలియజేశాడు. కొన్ని రుజువుల ఆధారంగా సెలబ్రిటీలకి బ్లూ టిక్ ఇవ్వనున్నట్లు.. దాని కోసం వెబ్ వర్షన్ కోసమైతే నెలకి 11.99 డాలర్లు, ఆండ్రాయిడ్ వర్షన్ అయితే నెలకి 14.99 డాలర్లు ఛార్జ్ చేయనున్నట్లు చెప్పుకొచ్చాడు. ఈ విధానాన్ని మొదట ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో ప్రారంభించి తర్వాత ఇతర దేశాలను విస్తరించనున్నట్లు తెలిపాడు.

ఈ విషయంపై తాజాగా బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా స్పందిస్తూ జుకర్‌బర్గ్‌పై సెటైర్లు వేసింది. ఈ భామ ట్విట్టర్‌లో షేర్ చేసిన పోస్ట్‌లో.. ‘హా హా.. ఎలాన్ మస్క్ దీని కోసమే ప్రపంచంతో పోరాడాడు. మీడియా ఆయన్ని విమర్శించింది. చాలామంది ట్విట్టర్‌ను ఉపయోగించమని బెదిరించారు. ఆయన ఆలోచనలనే జనాలు పూర్తిగా జీర్ణం చేసుకోలేదు. అప్పుడే చాలామంది ఆయన ఐడియాలను హైజాక్ చేసి వాటిని కాపీ కొడుతున్నారు. మేధావి అయితే ఇదే పెద్ద సమస్య’ అని సెటైరికల్‌గా రాసుకొచ్చింది. ఈ పోస్ట్ వైరల్ అవ్వడంతో పలువురు నెటిజన్లు సైతం కంగనా చెప్పింది నిజమేనంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Updated Date - 2023-02-20T15:13:20+05:30 IST