Karan johar - kangana: కరణ్‌జోహార్‌ అంత పని చేశాడా? వీడియో వైరల్‌...

ABN , First Publish Date - 2023-04-07T19:58:17+05:30 IST

నెపోటిజం, క్యాస్టింగ్‌ కౌచ్‌, మీటూ ఇలా ఏదో ఒక అంశంపై బాలీవుడ్‌ ఎప్పుడూ వార్తలో ఉంటున్న సంగతి తెలిసిందే!

Karan johar - kangana:  కరణ్‌జోహార్‌ అంత పని చేశాడా? వీడియో వైరల్‌...


నెపోటిజం(nepotism), క్యాస్టింగ్‌ కౌచ్‌, మీటూ (Metoo)ఇలా ఏదో ఒక అంశంపై బాలీవుడ్‌ (bollywood) ఎప్పుడూ వార్తలో ఉంటున్న సంగతి తెలిసిందే! హిందీ పరిశ్రమకు చెందిన చాలామంది తారలు ఈ మధ్యకాలంలో విపరీతంగా ట్రోల్‌ అవుతున్నారు. ఇప్పుడు కరన్‌ జోహార్‌ (Trolls on karna johar) వంతు వచ్చింది. అయితే ఆయనకు ఇలాంటివి కొత్తేమీ కాదు. ఆయనకు సంబంధించిన ఓ పాత వీడియో నెట్టింట వైరల్‌ అవుతుంది. దీనిపై చాలామంది బాలీవుడ్‌ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఇక బాలీవుడ్‌ తరచూ ఫైర్‌బ్రాండ్‌లా విరుచుకుపడే కంగనా కూడా ఈ వీడియోపై స్పందించారు. (Kangana comments on karan johar)

ఆ వీడియోలె ఏముందంటే.. అందులో అనుష్క శర్మను (anushka sharma) ఉద్దేశిస్తూ కరణ్‌ మాట్లాడారు. అనుష్కకు అవకాశాలు రాకుండా చేయాలని కరణ్‌ ప్రయత్నించినట్లు స్వయంగా వెల్లడించారు. ‘‘రబ్‌ నే బనాది జోడి’ (Rab ne banadi jodi)సినిమాలో అనుష్కను హీరోయిన్‌గా తీసుకుందామని ఆదిత్య చోప్రా నాకు ఆమె ఫొటో చూపించాడు. నేను అనుష్కను తీసుకోవద్దని ఆదిత్యతో చెప్పా. నీకేమైనా మెంటలా? తనని ఎందుకు ఎంపిక చేశావ్‌ అంటూ అరిచాను. ఆమెను ఆ సినిమా నుంచి తప్పించడానికి చాలా ప్రయత్నాలు చేశాను. కానీ,  ఆమె నటన చూసి నేను ఆశ్చర్యపోయాను. ఇంత ప్రతిభ ఉన్న అమ్మాయిని నేను తీసుకోవద్దని ఎందుకు చెప్పానా? అని గిల్టీగా అనిపించింది. సినిమా చూసొచ్చిన వెంటనే అనుష్కకు ఫోన్‌ చేసి ప్రశంసించా. తనకు సారీ కూడా చెప్పా’’ అని ఉన్న ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది.

ఈ వీడియోను కంగనా షేర్‌ చేసి ‘‘ఈ పెద్ద మనిషికి ఇదే పని. అందరి కెరీర్‌లు నాశనం చేయడమే అతని పని. అతనికున్న ఏకైక పని కూడా అదే అంటూ కామెంట్‌ చేసింది. ఈ వీడియోపై వివేక్‌ అగ్నిహోత్రి (Vivek agnihothri) కూడా స్పందించారు. ట్విట్టర్‌లో ఆ వీడియో షేర్‌ చేసి ‘‘కొందరికీ ఇలా చేయడం  హాబీగా మారిపోయింది. ఎంతో టాలెంట్‌ ఉన్న వారిని ఇండస్ర్టీకి రానివ్వకుండా ఇలా రాజకీయాలు చేస్తున్నారు. కాబట్టే బాలీవుడ్‌కి ఈ పరిస్థితి వచ్చింది’’ అని అన్నారు. 

Updated Date - 2023-04-07T19:58:18+05:30 IST