Kajol: 49 ఏళ్ల కాజోల్ ఎంత గ్లామర్ గా వుందో చూసారా... ఫోటోస్ వైరల్

ABN , First Publish Date - 2023-10-31T11:53:13+05:30 IST

బాలీవుడ్ నటి కాజోల్ దసరా ఉత్సవాలు ఎంతో సంబరంగా కుటుంబ సభ్యులతో జరుపుకొని, ఇప్పుడు వర్క్ మూడ్ లోకి వచ్చింది. లేటెస్ట్ గా చేసిన ఆమె ఫోటోషూట్ ఇప్పుడు వైరల్ అయింది.

Kajol: 49 ఏళ్ల కాజోల్ ఎంత గ్లామర్ గా వుందో చూసారా... ఫోటోస్ వైరల్
Kajol

సినిమా పరిశ్రమలో చాల కొద్దిమంది నటీమణులు మాత్రమే ఎక్కువకాలం కొనసాగ గలుగుతున్నారు. అందులో కాజోల్ దేవగన్ (Kajol) ఒకరు. సుమారు 31 సంవత్సరాల పాటు చిత్రసీమలో కొనసాగడం అంటే మామూలు మాటలు కాదు. అటువంటి కాజోల్ 1992లో తన మొదటి సినిమా 'బేఖుది' #Bekhudi తో మొదలు పెట్టి ఈరోజు వరకు సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తూ, కాజోల్ తన అందచందాలతో ఇంకా యువనటీమణులకి తానేమీ తీసిపోని అన్నట్టుగా వున్నారు.

kajol2.jpg

ఈ సంవత్సరం 'లస్ట్ స్టోరీస్2' #LustStories2 అనే సినిమాలో నటించిన కాజోల్, తరువాత 'ది ట్రయల్' #TheTrial అనే వెబ్ సిరీస్ లో కూడా నటించింది. ఈ వెబ్ సిరీస్ లో కాజోల్ నటనని అందరూ ప్రశంసించడమే కాకుండా, ఆమె ఇందులో చాలా బోల్డ్ పాత్ర చేసిందని కూడా అన్నారు.

kajol3.jpg

అలాగే ఈమధ్య దసరా ఉత్సవాల్లో కాజోల్ చాలా చురుకుగా పాల్గొనడమే కాకుండా సప్తమి, అష్టమి, నవమి ఈ మూడు రోజులు తన కుటుంబ సభ్యులు అందరితో సంబరాలు చెయ్యడమే కాకుండా, వచ్చిన చాలామంది అతిధులకు భోజనాలు కూడా ఏర్పాటు చేసింది కాజోల్.

kajol4.jpg

ఆ మూడు రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో తన కుటుంబం, తన తల్లి, నటి అయిన తనూజ (Tanuja), అలాగే అజయ్ దేవగన్ (AjayDevgn) తరపున బంధువులు, అందరితో చాలా సందడిగా దసరా ఉత్సవాలు జరుపుకున్న కాజోల్ ఆ ఫోటోలను అన్నీ తన సాంఘీక మాధ్యమంలో పోస్ట్ చేసింది.

kajol5.jpg

అలాగే తన మూడు రోజుల దసరా సంబరాలకు బాలీవుడ్ నుండి ఎంతోమంది హాజరయ్యారు. అందులో ముఖ్యంగా రాణి ముఖర్జీ (RaniMukherjee), జయ బచ్చన్ (JayaBachchan) కూడా వున్నారు. వీరితో పాటు చాలామంది బాలీవుడ్ నటీనటులు కాజోల్ ఆహ్వానం మేరకు హాజరయ్యారు.

kajol6.jpg

కాజోల్, అజయ్ దేవగన్ కుమారుడు యుగ్, సోదరి కుమారుడు అమన్ దేవగన్ ఇద్దరూ వచ్చిన అతిధులకు భోజనాలు వడ్డిస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో దసరా పండగా చేసుకుంది కాజోల్. 49 ఏళ్ల కాజోల్ ఈరోజుకి ఎంతో గ్లామర్ గా ఉంటూ, తన అందచందాలతో, నటనతో అందరినీ మెప్పిస్తూ, సినిమాలు, వెబ్ సిరీస్ లు చేసుకుంటూ వెళుతోంది.

Updated Date - 2023-10-31T13:01:51+05:30 IST