Kajol: ఒక నెల.. రెండు వివాదాల్లో హీరోయిన్‌!

ABN , First Publish Date - 2023-07-16T16:38:45+05:30 IST

చదువుపై అవగాహన లేని నాయకులు మనల్ని పాలిస్తున్నారంటూ రాజకీయ నాయకులను టార్గెట్‌ చేస్తూ కాజోల్‌ (kajol) చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమైన సంగతి తెలిసిందే! ఆమె చేసిన కామెంట్స్‌పై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఆమె వివరణ కూడా ఇచ్చారు. తాజాగా మరోసారి కాజోల్‌ వివాదాల్లో చిక్కుతుంది.

Kajol: ఒక నెల.. రెండు వివాదాల్లో హీరోయిన్‌!

చదువుపై అవగాహన లేని నాయకులు మనల్ని పాలిస్తున్నారంటూ రాజకీయ నాయకులను టార్గెట్‌ చేస్తూ కాజోల్‌ (kajol) చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమైన సంగతి తెలిసిందే! ఆమె చేసిన కామెంట్స్‌పై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఆమె వివరణ కూడా ఇచ్చారు. తాజాగా మరోసారి కాజోల్‌ వివాదాల్లో చిక్కుతుంది. బాలీవుడ్‌ స్టార్‌ హీరోపై ఆమె చేసినవ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దాంతో ఆ నటుడి అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా హల్‌చల్‌ చేస్తున్నాయి. తాజాగా ఆమె నటించిన కోర్ట్‌ రూమ్‌ డ్రామా ‘ది ట్రయల్‌’ (The trial) ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. శుక్రవారం ఈ సిరీస్‌ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ ఓటీటీలో విడుదలైంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.

kaj 2.jpeg

ఇందులో భాగంగా వ్యాఖ్యాత షారుక్‌ఖాన్‌ (Shah rukh Khan) గురించి అడగ్గా.. ‘‘ఆయనతో నాకు మంచి స్నేహం ఉంది. మళ్లీ ఒక రొమాంటిక్‌ సాంగ్‌ చేయాలని ఉంది’’ అని కాజోల్‌ అన్నారు. అనంతరం ‘ఒకవేళ ఇప్పుడు షారుఖ్‌ ఎదురైతే.. ఆయన్ని మీరు అడిగే ఒకేఒక్క విషయం ఏమిటి?’ అని ప్రశ్నించగా.. ‘‘పఠాన్‌’ నిజమైన కలెక్షన్స్‌ ఎంతో చెప్పమంటాను’’ అని బదులిచ్చారు. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలతో అభిమానులు ఆమెపై మండిపడుతున్నారు. షారుక్‌ నటించిన తాజా చిత్రం ‘పఠాన్‌’ బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబట్టినట్లు చిత్రబృందం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం దాదాపు రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు చేసిందని మేకర్స్‌ వెల్లడించారు. అయితే ఈ సినిమా కలెక్షన్లను ఉద్దేశించి కాజోల్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చాయి. పఠాన్‌’ చిత్రం నిజంగా అంత కలెక్షన్లు రాబట్టిందా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. షారుఖ్‌ - కాజోల్‌లది సక్సెస్‌ఫుల్‌ కాంబినేషన్‌. వీరిద్దరు కలిసి ‘దిల్‌వాలే దుల్హానియా లేజాయెంగే’, ‘బాజీఘర్‌’, ‘దిల్‌ వాలే’ వంటి హిట్‌ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు.

Updated Date - 2023-07-16T16:40:13+05:30 IST