Jyothika: అజయ్ దేవగన్, మాధవన్ లతో జ్యోతిక హిందీ సినిమా

ABN , First Publish Date - 2023-05-15T12:15:32+05:30 IST

అజయ్ దేవగన్, మాధవన్ లో ఒక హిందీ సినిమాలో జ్యోతిక చేస్తోందని ఆ సినిమా నిర్వాహకులు ఈరోజు ప్రకటించారు. దీనికి వికాస్ బెహల్ దర్శకుడు, అజయ్ దేవగన్ నిర్మాతల్లో ఒకడు.

Jyothika: అజయ్ దేవగన్, మాధవన్ లతో జ్యోతిక హిందీ సినిమా
Jyothika

నటుడు సూర్య (Suriya) భార్య జ్యోతిక (Jyothika) ఇప్పుడు చాలా బిజీ నటి అయిపొయింది. అటు తమిళం, మలయాళం లో చేస్తూ ఇటు హిందీ సినిమాలు కూడా ఒప్పుకుంటోంది. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం జ్యోతిక ఒక హిందీ సినిమా చేస్తోంది, దాంట్లో ఆమె అజయ్ దేవగన్ (AjayDevgn), మాధవన్ (Madhavan) లతో స్క్రీన్ స్పేస్ పంచుకుంటుందని ప్రకటించారు. ఈ సినిమాకి దర్శకుడు వికాస్ బెహల్ (VikasBahl) కాగా, ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఈ సినిమా నిర్వాహకులు బిజీ గా వున్నారు. ఈ దర్శకుడు ఇంతకు ముందు 'క్వీన్', 'షాందార్', 'గుడ్ బై' సినిమాలను తీసాడు.

jyothika2.jpg

ఇప్పుడు తీయబోయే ఈ సినిమా వచ్చే నెలలో షూటింగ్ మొదలెట్టవచ్చు అని చెపుతున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా ముంబై, ముస్సోరి, లండన్ లో ఉంటుంది అని ప్రకటించారు. అజయ్ దేవగన్ ఈ సినిమాలో నటించటం తో పాటు, ఈ సినిమా నిర్మాణంలో కూడా భాగం అయ్యాడని తెలిసింది. ఇంతకు ముందు 'దృశ్యం 2' (Drishyam 2) ని నిర్మించిన వాళ్ళీ ఈ సినిమాని కూడా నిర్మిస్తున్నట్టు గా ప్రకటించారు.

Ajaydevgan.jpg

జ్యోతిక ప్రస్తుతం ఒక మలయాళం సినిమా ఒప్పుకుంది, అందులో మమ్మూట్టి (Mammootty) పక్కన చేస్తోంది. ఈ సినిమా దర్శకుడు జియో బేబీ (JeoBaby), కాగా ఆదర్శ్ సుకుమారన్ రచయిత. ఆసక్తికర అంశం ఏంటంటే ఈ సినిమాకి మమ్మూట్టి నిర్మాత కూడా. ఇది కాకుండా ఇంకో హిందీ సినిమా కూడా చేస్తోంది అని తెలిసింది.

Updated Date - 2023-05-15T12:15:32+05:30 IST