Jr NTR : బాలీవుడ్ లో మొదటి సినిమా 'వార్‌-2’ కాదు..

ABN , First Publish Date - 2023-10-03T13:37:08+05:30 IST

హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan) హీరోగా అయాన్‌ ముఖర్జీ తెరకెక్కించనున్న ‘వార్‌ - 2’ (War-2) చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌.. పక్కా యాక్షన ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షనలు పూర్తయ్యాయి.

Jr NTR : బాలీవుడ్ లో మొదటి సినిమా 'వార్‌-2’ కాదు..

హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan) హీరోగా అయాన్‌ ముఖర్జీ తెరకెక్కించనున్న ‘వార్‌ - 2’ (War-2) చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌.. పక్కా యాక్షన ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షనలు పూర్తయ్యాయి. ఇటీవలే ఎన్టీఆర్‌తో అయాన్‌ ముఖర్జీ (Ayan Mukharji)చర్చలు జరిపారు. నవంబర్‌లో షూటింగ్‌ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్‌ (NTR తెలుగులో 'దేవర’ (Devara) షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అయితే 'వార్‌-2’ చిత్రం కన్నా ముందే ఎన్టీఆర్‌ బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్నట్లు బాలీవుడ్‌ మీడియా కోడై కూస్తోంది. 'వార్‌-2 కాకుండా మరో చిత్రంలో ఎన్టీఆర్‌ అతిథిగా కనిపించనున్నారట.

సల్మాన్‌ఖాన్‌, కత్రినా కైఫ్‌ జంటగా నటిస్తోన్న చిత్రం ‘టైగర్‌ 3’. ‘టైగర్‌ జిందా హై’కు సీక్వెల్‌గా మనీశ్‌ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో క్లైమాక్స్‌లో ఎన్టీఆర్‌ కనిపించనున్నారట. ఈ విషయంపై బాలీవుడ్‌ మీడియాలో ఇప్పటికే వార్తలు వచ్చాయి. దీంతో ‘వార్‌ 2’ కంటే ముందే ఎన్టీఆర్‌ బీటౌన్‌లో ఎంట్రీ ఇవ్వడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.

War 2.jpeg

ఇప్పటికే ‘టైగర్‌ 3’లో షారుక్‌ అతిథి పాత్రలో కనిపిస్తున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్‌ కూడా ఈ చిత్రంలో ఉన్నారని భారీగా ప్రచారం సాగుతోంది. ఇదే కనుక నిజం అయితే భారీ మల్టీస్టారర్‌ అవుతుంది. దీపావళి కానుకగా ఈ చిత్రం  ప్రేక్షకుల ముందుకు రానుంది. 'వార్‌ 2’ను తెరకెక్కిస్తున్న యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ నిర్మాణ సంస్థపైనే ‘టైగర్‌ 3’ కూడా రూపొందుతోంది. దీంతో ఈ చిత్ర నిర్మాతలు ఎన్టీఆర్‌తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. 'వార్‌-2 కంటే ముందే టైగర్‌-3 చిత్రం విడుదల కానుంది. కాబట్టి ఎన్టీఆర్‌ నటించే తొలి చిత్రం 'టైగర్‌-3 అని చెప్పొచ్చు.

Updated Date - 2023-10-03T13:44:13+05:30 IST