Jawan : జవాన్ సక్సెస్‌.. దర్శకుడి పోస్ట్‌ వైరల్‌! 

ABN , First Publish Date - 2023-10-27T17:29:00+05:30 IST

‘పఠాన్‌’(pathan) భారీ విజయంతో పవర్‌ఫుల్‌ కమ్‌బ్యాక్‌ ఇచ్చారు బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ఖాన్‌(Shah rukh Khan). ఆ చిత్రం దాదాపు రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు చేసి రికార్డు సృష్టించింది. గత నెలలో విడుదలైన ‘జవాన్‌’ (Jawan) విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ రికార్డులను బ్రేక్‌ చేస్తోంది.

Jawan : జవాన్ సక్సెస్‌.. దర్శకుడి పోస్ట్‌ వైరల్‌! 

‘పఠాన్‌’(pathan) భారీ విజయంతో పవర్‌ఫుల్‌ కమ్‌బ్యాక్‌ ఇచ్చారు బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ఖాన్‌(Shah rukh Khan). ఆ చిత్రం దాదాపు రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు చేసి రికార్డు సృష్టించింది. గత నెలలో విడుదలైన ‘జవాన్‌’ (Jawan) విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ రికార్డులను బ్రేక్‌ చేస్తోంది. ‘జవాన్‌’ భారీ అంచనాల మధ్య సెప్టెంబర్‌ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం విడుదలై 50 రోజులు పూర్తి కావడంతో దర్శకుడు అట్లీ స్పెషల్‌ పోస్ట్‌ చేశారు.

‘‘జవాన్‌’ ప్రేక్షకుల ముందుకొచ్చి 50 రోజులవుతోంది. ఇప్పటికీ ఈ చిత్రం కొన్ని లక్షల మంది హృదయాలను గెలుచుకుంటోంది. ప్రపంచమంతా దీని హవా కనిపిస్తూనే ఉంది’ అంటూ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. తొలిరోజే రూ.100కోట్లు వసూళ్లు చేసిన ఈ చిత్రం ఇప్పటి వరకు రూ.1,145 కోట్ల కలెక్షన్స్‌ రాబట్టింది. 50వ రోజు కూడా సుమారు రూ.11లక్షలు వసూళ్లు రాబట్టింది. దీంతో షారుక్‌ ఫ్యాన్స సంబరపడుతున్నారు. ఇందులో నయనతార హీరోయిన్‌గా నటించగా... ప్రతినాయకుడిగా విజయ్‌ ేసతుపతి కనిపించారు. ప్రియమణి, సాన్యా మల్హోత్ర, దీపికా పదుకొణె కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం షారుక్‌ రాజ్‌కుమార్‌ హిరాణీ దర్శకత్వంలో ‘డంకీ’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. డిసెంబర్‌ 21న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. షారుక్‌ పుట్టినరోజు సందర్భంగా నవంబర్‌ 2న ఈ చిత్రం టీజర్‌ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తాప్సీ, దియా మీర్జా, బొమన్‌ ఇరానీ తదితరులు కీలక పాత్రధారులు. గౌరీఖాన్‌, రాజ్‌కుమార్‌ హిరాణీ, జ్యోతి దేశ్‌ పాండే నిర్మాతలు.

Updated Date - 2023-10-27T17:29:59+05:30 IST