Janhvi Kapoor: కారు ముందు సీట్లో కూర్చుంటే బాయ్‌ఫ్రెండ్‌గా మారిపోతున్నాడంటున్న హీరోయిన్

ABN , First Publish Date - 2023-03-08T18:23:42+05:30 IST

అతిలోక సుందరి శ్రీదేవి (Sridevi) కూతురిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అందాల భామ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). ‘గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్’, ‘మిలీ’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ‘మిస్టర్ అండ్ మిసెస్ మహీ’ మూవీలో నటిస్తోంది.

Janhvi Kapoor: కారు ముందు సీట్లో కూర్చుంటే బాయ్‌ఫ్రెండ్‌గా మారిపోతున్నాడంటున్న హీరోయిన్

అతిలోక సుందరి శ్రీదేవి (Sridevi) కూతురిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అందాల భామ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). ‘గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్’, ‘మిలీ’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ‘మిస్టర్ అండ్ మిసెస్ మహీ’ మూవీలో నటిస్తోంది. ఈ మధ్య అనేక వెబ్‌సైట్స్‌లో ఆమె ప్రేమాయణంపై కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఆ కథనాలపై ఆమె స్పందించింది.

టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి (Rana Daggubati) కీలక పాత్ర పోషించిన వెబ్‌సిరీస్ ‘రానా నాయుడు’ (Rana Naidu). ఈ సిరీస్‌లో రానా సెలబ్రిటీల సమస్యలను పరిష్కరించే ఫిక్సర్‌గా కనిపించనున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ షో మార్చి 10 నుంచి స్ట్రీమింగ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడటంతో మేకర్స్ ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. అందులో భాగంగా ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో రానా దగ్గుబాటి, జాన్వీ కపూర్ కనిపించారు. ‘‘చాలా మంది సెలబ్రిటీల సమస్యలను మీరు పరిష్కరిస్తున్నారు. నా సమస్యను కూడా పరిష్కరించండి..?’’ అని జాన్వీ కపూర్ కోరుతుంది. సమస్య ఏంటో చెప్పమని రానా అడుగుతాడు. ‘‘నేను కారు ముందు సీట్లో ఎప్పుడు కూర్చొకూడదనుకుంటున్నాను. కారు ముందు భాగంలో ఉన్నప్పుడు ఏ వ్యక్తి అయితే నా పక్కన కూర్చుంటాడో తర్వాతి రోజే అతడు నా బాయ్‌ఫ్రెండ్‌గా మారిపోతున్నాడు. ఈ విధంగా చేస్తున్నందుకు ఫొటోగ్రాఫర్స్ అందరికి ధన్యవాదాలు. ఇటువంటి వార్తలతో నా డ్రైవర్ భార్య కూడా భయపడుతుంది’’ అని జాన్వీ చెబుతుంది. అంతలోనే రానా ముందు ఓ వార్తా పత్రికను ఉంచుతుంది. ఆ పత్రికలో.. ‘రూమర్డ్ బాయ్‌ఫ్రెండ్‌తో జాన్వీ కపూర్’’ అనే హెడ్‌లైన్‌తో ఓ న్యూస్ ఉంది.

జాన్వీ కపూర్ కొన్ని వారాల క్రితం ఓ వేడుకలో శిఖర్ పహరియా (Shikhar Pahariya)తో కలసి దర్శనమిచ్చింది. ఈ ఈవెంట్‌కు ఇధ్దరు ఒకే కారులో వచ్చారు. దీంతో పలు పత్రికలు జాన్వీ.. శిఖర్ పహరియాతో ప్రేమాయణం కొనసాగిస్తుందని కథనాలు రాశాయి.

Updated Date - 2023-03-08T18:23:43+05:30 IST