New Movie on OTT: జాన్వీ కపూర్, వరుణ్ ధావన్ మూవీ డైరెక్ట్ గా ఓటిటి లో విడుదల

ABN , First Publish Date - 2023-07-20T18:13:54+05:30 IST

జాన్వీ కపూర్, వరుణ్ ధావన్ నటించిన హిందీ సినిమా 'బవాల్' జులై 21 అంటే రేపు అమెజాన్ ప్రైమ్ వీడియో లో డైరెక్ట్ గా విడుదల అవుతోంది.

New Movie on OTT: జాన్వీ కపూర్, వరుణ్ ధావన్ మూవీ డైరెక్ట్ గా ఓటిటి లో విడుదల
A still from Bawaal

అటు సాంఘీక మాధ్యమంలోనూ, ఇటు బాలీవుడ్, టాలీవుడ్ లోనూ హడావిడి చేస్తున్న యువ నటి జాన్వీ కపూర్ (JanhviKapoor), వరుణ్ ధావన్ (VarunDhawan) జంటగా నటించిన 'బవాల్' (Bawaal) రేపు ఓటిటి లో డైరెక్ట్ గా విడుదల అవుతోంది. ఈ సినిమా ముందుగా థియేటర్ లో విడుదల చేద్దామని నిర్మాత సాజిద్ నాడియావాలా (SajidNadiadwala) అనుకున్నాడు, కానీ మళ్ళీ మనసు మార్చుకొని డైరెక్ట్ గా ఓటిటి లో స్ట్రీమింగ్ చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. నితీష్ తివారి (NiteshTiwari) దీనికి దర్శకుడు.

bawaal.jpg

ఈ సినిమా షూటింగ్ కొన్ని ప్రపంచ దేశాల్లో చేశారు, ఏప్రిల్ 2022 లో మొదలు పెట్టి ఆగష్టు 2022 లో పూర్తి చేశారు. ముంబై, కాన్పూర్, లక్నో, పారిస్, బెర్లిన్, ఆమ్స్టర్డ్యామ్ (Amsterdam), క్రకోవ్, వార్సా, పోలాండ్ లోని కొన్ని ప్రదేశాలలో ఈ సినిమా చిత్రీకరించారు. ఇది ఒక రొమాంటిక్ డ్రామా అని, భార్య భర్తలు అయినా జాన్వీ కపూర్, వరుణ్ ధావన్ మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు చివరికి ఎటువంటి పరిస్థితికి దారితీసాయి అనే కథా నేపథ్యంలో తీసిన సినిమా తెలుస్తోంది.

ఈ సినిమా ప్రముఖ ఓటిటి ఛానల్ అమెజాన్ ప్రైమ్ (AmazonPrimeVideo) లో జులై 21 న విడుదల అవుతోంది.

Updated Date - 2023-07-20T18:13:54+05:30 IST