Ileana D'Cruz : పండండి మగబిడ్డతో... కోరిక నెరవేరింది!

ABN , First Publish Date - 2023-08-06T11:14:07+05:30 IST

గోవా బ్యూటీ ఇలియానా (Ileana D'Cruz) తల్లయింది. ఆగస్ట్‌ ఒకటో తేదీనా ఆమె పండంటి మగబిడ్డకు (Babyboy) జన్మనిచ్చింది. ఈ విషయాన్నిఆదివారం సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది.

Ileana D'Cruz : పండండి మగబిడ్డతో... కోరిక నెరవేరింది!

గోవా బ్యూటీ ఇలియానా (Ileana D'Cruz) తల్లయింది. ఆగస్ట్‌ ఒకటో తేదీనా ఆమె పండంటి మగబిడ్డకు (Babyboy) జన్మనిచ్చింది. ఈ విషయాన్నిఆదివారం సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. తన బిడ్డ ఫొటో షేర్‌ చేసి తన ఆనందాన్ని పంచుకున్నారు. అతనికి నామకరణం కూడా చేసింది. ‘మా ప్రియమైన అబ్బాయి ‘కోవా ఫీనిక్స్‌ డోలన్‌’ని పరిచయం చేస్తున్నాను. మా హృదయాలను దాటి ప్రపంచానికి పరిచయం చేస్తున్నందుకు ఎంత సంతోషిస్తున్నామో మాటల్లో చెప్పలేం. గొప్ప అనుభూతి ఇది’’ అని ఇలియానా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది.

పలువురు నెటిజన్లతోపాటు సినీ తారలు నర్గీస్‌ ఫక్రీ, హూమా ఖురేషి, అర్జున్‌ కపూర్‌, సోఫి చౌదరి తదితరులు ఇలియానాకు శుభాకాంక్షలు తెలిపారు. ఇలియానా తల్లి కానున్నట్లు ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రకటించింది. తన ప్రియుడిని ఎవరో రెండు వారాల క్రితం పరిచయం చేసింది. అయితే అతని పేరు మాత్రం చెప్పలేదు. అయితే గర్భవతి అయినప్పటి నుంచి ఎప్పటికప్పుడు తన అప్‌డేట్‌ ఇస్తుంది ఇలియానా. బేబీబంప్‌ ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ ‘తన కడుపులో ఓ జీవం పెరుగుతుందనే విషయం ఎంతో గొప్పగా ఉందనీ, మాతృత్వాన్ని ఆస్వాదించాలనే కోరిక రోజురోజుకి పెరుగుతుందని’ ఇలియానా చెప్పిన సంగతి తెలిసిందే.

Updated Date - 2023-08-06T11:16:05+05:30 IST