Sara Ali Khan: శుభ్ మన్ గిల్ తో డేటింగ్ చేస్తున్నది నేను కాదు, ఆ సారా వేరే ఆమె...

ABN , First Publish Date - 2023-11-09T13:15:19+05:30 IST

కరణ్ జోహార్ తన 'కాఫీ విత్ కరణ్' షో లో ఈసారి సారా అలీఖాన్, అనన్యా పాండే లతో మాట్లాడేడు. అందులో క్రికెటర్ శుబ్ మన్ గిల్ తో డేటింగ్ లో వున్నది నువ్వేనా అని సారా అలీ ఖాన్ ని అడిగితే, ఆమె సమాధానం అదిరింది

Sara Ali Khan: శుభ్ మన్ గిల్ తో డేటింగ్ చేస్తున్నది నేను కాదు, ఆ సారా వేరే ఆమె...
Sara Ali Khan and Ananya Pandey

ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు, నటుడు కరణ్ జోహార్ (KaranJohar) తన షో 'కాఫీ విత్ కరణ్' (KoffeeWithKaran) ఇంకో సీజన్ మొదలెట్టారు. ఇది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (DisneyPlusHotStar) లో ప్రసారం అవుతోంది. ఈవారం అతని షోలో సారా అలీఖాన్ (SaraAliKhan), అనన్యా పాండే (AnanyaPandey) సందడి చేశారు. అయితే ఈ షో ప్రోమో ఒకటి విడుదల చేశారు. అందులో కరణ్ జోహార్ కొన్ని ప్రశ్నలు సరదాగా అడిగాడు, దానికి సమాధానం కూడా వాళ్లిద్దరూ అంతే సరదాగా, చలాకీగా చెప్పుకొచ్చారు.

saraalikhandating.jpg

సారా, నువ్వు ప్రముఖ క్రికెటర్ శుభ్ మన్ గిల్ (SubhmanGill) తో డేటింగ్ లో ఉన్నావా, వార్తలు వస్తున్నాయి అని కరణ్ జోహార్ సారా అలీఖాన్ ని అడిగినప్పుడు ఆమె నవ్వుతూ, నేను ఆ సారా ని కాదు అని చెప్పింది. "ప్రపంచం మొత్తం రాంగ్ సారా వెనకాల పడుతోంది, మీరందరూ చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు," అని చెప్పింది సారా అలీ ఖాన్. ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ (SachinTendulkar) కుమార్తె సారా టెండూల్కర్ (SaraTendulkar), గిల్ డేటింగ్ చేస్తున్న విషయం వార్తల్లో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అందుకే ఈ ప్రశ్న కరణ్ కావాలనే సారా అలీ ఖాన్ ని అడిగినట్టుగా తెలుస్తోంది. దానికి సమాధానం కూడా అంతే సరదాగా సారా అలీఖాన్ చెప్పింది.

ananyapandeyadityaroy.jpg

అలాగే ఇంకొక నటీమణి అనన్యా పాండే కూడా ఈ షోలో సారా అలీఖాన్ తో వచ్చింది. ఆమె ఆదిత్య రాయ్ కపూర్ (AdityaRoyKapoor) ని డేటింగ్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దాని మీద కరణ్ పరోక్షంగా అడిగితే, ఆమె కూడా అదే పద్దతిలో ఆదిత్య రాయ్ కపూర్ గురించి చెప్పకనే చెప్పింది. ఇలా ఈ ఇద్దరూ ఆ షోలో సందడి చేస్తూ, అల్లరి కూడా చేశారు. ఇంకా వారిద్దరి గురించి చాలా విషయాలు కరణ్ అడిగితే, వాళ్లిద్దరూ తమదైన రీతిలో సమాధానాలు చెప్పారు.

Updated Date - 2023-11-09T13:15:20+05:30 IST