Animal: ఇదెక్క‌డి మాస్ రా మామ‌.. యానిమ‌ల్ నాన్‌స్టాప్ కొట్టుడు

ABN , First Publish Date - 2023-12-07T15:47:21+05:30 IST

ఇప్ప‌డు దేశ‌మంత‌టా వినిపిస్తున్న ఒకే ఒక ప‌దం యానిమ‌ల్. సందీప్ రెడ్డి వంగా ఏ ముహుర్తానా ఈ సినిమాను తీశాడో గానీ ఇప్పుడు బాలీవుడ్‌లో సృష్టిస్తున్న రికార్డులు అన్నీ ఇన్నీ కావు. తాజాగా ఈ లిస్టులోకి మ‌రో స‌రికొత్త రికార్డు వ‌చ్చి చేరింది.

Animal: ఇదెక్క‌డి మాస్ రా మామ‌.. యానిమ‌ల్ నాన్‌స్టాప్ కొట్టుడు
ranbir kapoor

ఇప్ప‌డు దేశ‌మంత‌టా వినిపిస్తున్న ఒకే ఒక ప‌దం యానిమ‌ల్ (Animal). ఏ ముహుర్తానా సందీప్ రెడ్డి వంగా ఈ ఏ ముహుర్తానా ఈ సినిమాను తీశాడో గానీ ఇప్పుడు బాలీవుడ్‌ను బాగా షేక్ చేస్తున్న‌ది. స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor), అనిల్ కపూర్, బాబీ డియోల్, రష్మిక మందన్న, తృప్తి డిమ్రీ (Triptii Dimri) తదితరులు నటించిన ఈ సినిమా ప్ర‌స్తుతం సృష్టిస్తున్న రికార్డులు అన్నీ ఇన్నీ కావు. తాజాగా ఈ లిస్టులోకి మ‌రో స‌రికొత్త రికార్డు వ‌చ్చి చేరింది.

ఈ సినిమాకు రోజురోజుకు డిమాండ్ పెర‌గ‌డంతో ముంబయిలో థియేట‌ర్ల యాజ‌మాన్యాలు ప్ర‌త్యేక షోలు వేస్తూ స‌రికొత్త సాంప్ర‌దాయానికి తెర తీశారు. బాలీవుడ్‌ చ‌రిత్ర‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఏ సినిమాకు జ‌ర‌గ‌ని విధంగా మొట్ట‌మొద‌టి సారిగా యానిమ‌ల్ సినిమాను 24 గంట‌లు నాన్‌స్టాప్‌గా ప్ర‌ద‌ర్శిస్తున్నారు. 3 గంట‌ల 21 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రం మొద‌టి ఆట ఉద‌యం 5.30 గంట‌ల‌కు స్టార్ట్ చేస్తే చివ‌రి ఆట తిరిగి మ‌రుస‌టి రోజు ఉద‌యం 2 గంట‌ల‌కు వేస్తున్నారు.


యానిమ‌ల్ చిత్రం గురువారం నాటికి మ‌న దేశంలో అన్ని భాషల్లో కలిపి రూ.300 కోట్లకు పైగానే వసూలు చేయ‌గా, ప్రపంచ వ్యాప్తంగా రూ.527.60 కోట్లు వసూలు సాధించి రికార్డులు తిర‌గ రాసింది. ఇక తెలుగు రాష్ట్రాల‌లోనూ 5 రోజుల‌లో 30 కోట్ల‌కు పైగా షేర్ క‌లెక్ట్ చేసి ఇంత‌వ‌ర‌కు ఏ బాలీవుడ్ చిత్రం సాధించ లేని ఘ‌న‌తను సాధించింది.

Updated Date - 2023-12-07T15:52:11+05:30 IST