Krrish 4: క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన హృతిక్ రోషన్.. తనకి నచ్చిన పాత్రే మాత్రం..

ABN , First Publish Date - 2023-01-10T11:08:38+05:30 IST

మన దేశంలో సూపర్ హీరో అంటే మొదట గుర్తొచ్చే పేరు ‘క్రిష్’ (Krrish). హృతిక్ రోషన్ (Hrithik Roshan) హీరోగా నటించిన ఈ చిత్రానికి దేశవ్యాప్తంగా భారీ అభిమానులు ఉన్నారు.

Krrish 4: క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన హృతిక్ రోషన్.. తనకి నచ్చిన పాత్రే మాత్రం..
Hrithik Roshan

మన దేశంలో సూపర్ హీరో అంటే మొదట గుర్తొచ్చే పేరు ‘క్రిష్’ (Krrish). హృతిక్ రోషన్ (Hrithik Roshan) హీరోగా నటించిన ఈ చిత్రానికి దేశవ్యాప్తంగా భారీ అభిమానులు ఉన్నారు. ఈ సిరీస్‌లో ఇప్పటికే ‘కోయి మిల్ గయా’, ‘క్రిష్’, ‘క్రిష్ 3’ సినిమాలు వచ్చాయి. ఆ మూడు చిత్రాలు కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. దీంతో ‘క్రిష్ 4’ (Krrish 4) కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో ఈ చిత్రం గురించి హృతిక్ క్రేజీ అప్‌డేట్ ఇచ్చాడు.

హృతిక్ మాట్లాడుతూ.. ‘‘మనమందరం కలిసి ఒక చిన్న ప్రార్థన చేయాలి. ‘క్రిష్ 4’ అన్ని సిద్ధమయ్యాయి. కానీ చిన్న సాంకేతిక సమస్య వచ్చింది. దాన్ని ఈ ఏడాది చివరిలోపు అధిగమిస్తామని అనుకుంటున్నా. ‘క్రిష్ 4’ కచ్చితంగా నా జాబితాలో ఉంది. త్వరలోనే వెండితెర మీద సందడి చేస్తుంది’ అని చెప్పుకొచ్చాడు.

అలాగే ‘క్రిష్ 4’లో మొదటి సినిమాలో కనిపించిన జాదూ కూడా కనిపిస్తాడనే ప్రచారం జరుగుతోంది. దీనిపై హృతిక్ స్పందిస్తూ.. ‘జాదూ తిరిగి వస్తాడా లేదా అనేది సినిమాలో చూడండి. కానీ ఓ మ్యాజిక్ మాత్రం ఉంటుంది. అలాగే చాలా ఆశ్చర్యకరమైన, మీ ఊహాకి అందని విషయాలు జరుగుతాయి’ అని తెలిపాడు. అలాగే ‘కోయి మిల్ గయా’ తను చేసిన రోహిత్ క్యారెక్టర్ తనకు ఎంతో ఇష్టమని హృతిక్ చెప్పాడు. ఆ మూవీ చూసి తన కొడుకులు చూసి ఇంప్రెస్ అవ్వడం, చాలా సంతోషాన్ని ఇచ్చిందని తెలిపాడు. కాగా.. హృతిక్ ప్రస్తుతం ‘ఫైటర్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు.

Updated Date - 2023-01-10T11:08:40+05:30 IST