Fighter: హృతిక్ రోషన్ ‘ఫైటర్’ ‌టీజర్.. ఇది బాలీవుడ్ సినిమానా లేక హాలీవుడ్డా

ABN , First Publish Date - 2023-12-08T18:03:06+05:30 IST

విక్రమ్ వేద చిత్రం తర్వాత హృతిక్ రోషన్ నటిస్తున్న కొత్త సినిమా ఫైటర్. దీపికా పదుకుణే, అనీల్ కపూర్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా సిద్ధార్ధ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ కు మంచి ఆదరణ లభించగా ఈ రోజు (శుక్రవారం) సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.

Fighter: హృతిక్ రోషన్ ‘ఫైటర్’ ‌టీజర్.. ఇది బాలీవుడ్ సినిమానా లేక హాలీవుడ్డా
fighter

విక్రమ్ వేద చిత్రం తర్వాత హృతిక్ రోషన్ (Hrithik Roshan) నటిస్తున్న కొత్త సినిమా ఫైటర్ (Fighter). దీపికా పదుకుణే (Deepika Padukone), అనీల్ కపూర్ (Anil Kapoor) ప్రధాన పాత్రలు పోషిస్తుండగా సిద్ధార్ధ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 25న రిపబ్లిక్ డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. వయాకామ్‌ 18 స్టూడియోస్ (Viacom18 Studios)-మార్‌ఫ్లిక్స్‌ పిక్చర్స్‌ సంయుక్త నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ కు మంచి ఆదరణ లభించగా ఈ రోజు(శుక్రవారం) సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.

మ‌న దేశం నుంచి ఫస్ట్ టైం ఎవియేష‌న్ జాన‌ర్‌లో రూపొందుతున్న ఈఫైటర్ (Fighter) సినిమా టీజర్ ను చూస్తే హాలీవుడ్ టాప్ స్టార్ టామ్ క్రూజ్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమా టాప్ గన్ తరహలో రూపొందించి నట్లుగా తెలుస్తోంది. ఇందులోని యాక్షన్ సన్నివేశాలు, ఆ సినిమా రీతిలోనే హై టెక్నికల్ స్టాండర్డ్స్ తో చిత్రీకరించినట్టు తెలుస్తున్నది. మమ్మల్ని పట్టుకోవాలంటే? మీరు వేగంగా ఉండాలి అంటూ ఒకటి రెండు డైలాగ్స్, తో కట్ చేసిన ఈ టీజర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నది.


ఈ సినిమాలో హృతిక్ (Hrithik Roshan) స్క్వాడ్రన్ లీడర్ షంషేర్ పఠానియా (పాటీ) అనే స్క్వాడ్రన్ ఫైలట్ పాత్ర‌లో కనిపించబోతుండగా దీపికా పదుకొనే స్క్వాడ్రన్ లీడర్‌ మిన్నిగా నటిస్తున్నది. అయితే టీజర్ లో హృతిక్ , దీపిక ల మధ్య వచ్చే రోమాన్స్ సన్నివేశాలు పఠాన్ సినిమాకు మించి ఉన్నట్లు తెలుస్తుండగా హాట్ సీన్స్ కూడా అదే రేంజ్ లో ఉండనున్నట్లు అర్థమవుతున్నది., మనం హాలీవుడ్ సినిమా చూస్తున్నామా అన్నట్లుగా ఉండనున్నట్లు తెలస్తున్నది.

Updated Date - 2023-12-08T18:05:33+05:30 IST