RIP Gufi Paintal: బాలీవుడ్‌లో మరో విషాదం.. గుఫి పైంటాల్ కన్నుమూత
ABN , First Publish Date - 2023-06-05T15:41:31+05:30 IST
మహాభారత్ (Mahabharat) సీరియల్‌లో శకుని (shakuni)మామగా నటించిన సీనియర్ నటుడు గుఫి పైంటాల్ (80) సోమవారం కన్నుమూశారు. (Gufi Paintal) అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆయన మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యుల వెల్లడించారు.

మహాభారత్ (Mahabharat) సీరియల్‌లో శకుని (shakuni)మామగా నటించిన సీనియర్ నటుడు గుఫి పైంటాల్ (80) సోమవారం కన్నుమూశారు. (Gufi Paintal) అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆయన మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యుల వెల్లడించారు. వారం రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గుఫి సోమవారం ఉదయం 9 గంటల తర్వాత తుదిశ్వాస విడిచారని ఆయన మేనల్లుడు హిటెన్ వెల్లడించారు. ఆయనకు ఓ కొడుకు, కోడలితో పాటు ఓ మనవడు కూడా ఉన్నారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు అంధేరి సబర్బన్‌లోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
గుఫీ అసలు పేరు సరబ్జిత్ సింగ్ పైంటాల్. పంజాబ్‌లో జన్మించిన ఆయన ఇంజనీరింగ్ చేశారు. తదుపరి ఆయన సోదరుడి సహకారంతో యాక్టింగ్ వైపు అడుగులేశారు. 1969లో ముంబైకి మకాం మార్చి మోడలింగ్‌లో అడుగుపెట్టారు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా పలు చిత్రాలకు, సీరియళ్లకు పనిచేయడమే కాకుండా నటించారు కూడా. ఆయన సోదరుడిని డైరెక్ట్ చేశారు. బి.ఆర్ చోప్రా, రవి చోపార దర్శకత్వం వహించిన ‘మహాభారత్’ సీరియల్‌లో శకుని పాత్రతో ఆయనకు ఎంతో గుర్తింపు వచ్చింది. శకుని పాత్ర ఆయనకు కెరీర్ బెస్ట్ రోల్ అని గుఫి పైంటాల్ చెబుతుండేవారు. శ్రీ చైతన్య మహ్రాపభు సినిమాను కూడా ఆయన డైరెక్ట్ చేశారు. ‘మహాభారత్’ సీరియల్‌తోపాటు బహదూర్ షా జఫర్, కానూన్, ఓం నమః శివాయ, సీఐడీ, కోయి హై ద్వారకా ధీష్ భగవాన్ శ్రీ కృష్ణ, రాధాకృష్ణ సీరియళ్లలో కనిపించాడు. 1975 చిత్రం రఫూ చక్కర్‌తో బాలీవుడ్‌లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత దిల్లాగీ, దేశ్ పరదేశ్, సుహాగ్ చిత్రాలలో కనిపించాడు. గుఫీ మరణవార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.