Gadar 2 : రెండు కొంటే.. రెండు ఫ్రీ..

ABN , First Publish Date - 2023-08-30T16:57:20+05:30 IST

రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని అభిమానులు, ప్రేక్షకులకు ‘గదర్‌2’(Gadar 2) చిత్ర బృందం సరికొత్త ఆఫర్‌ ఇచ్చింది. కుటుంబ సభ్యులతో ఆకలిసి సినిమా చూడాలనుకునేవారి కోసం రెండు టికెట్లు కొన్నవారికి మరో రెండు టికెట్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు

Gadar 2 : రెండు కొంటే.. రెండు ఫ్రీ..

రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని అభిమానులు, ప్రేక్షకులకు ‘గదర్‌2’(Gadar 2) చిత్ర బృందం సరికొత్త ఆఫర్‌ ఇచ్చింది. కుటుంబ సభ్యులతో ఆకలిసి సినిమా చూడాలనుకునేవారి కోసం రెండు టికెట్లు కొన్నవారికి మరో రెండు టికెట్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు (Rakhi Special offer) బాలీవుడ్‌ నటుడు సన్నీదేఓల్‌, అమీషా పటేల్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గదర్‌ 2’. 2001లో విడుదలైన బ్లాక్‌బస్టర్‌ మూవీ ‘గదర్‌’కు కొనసాగింపుగా ఈ చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు అనిల్‌ శర్మ. ఆగస్టు 11న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. (By two Get Two Free)

రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని చిత్రబృందం తాజాగా స్పెషల్‌ ఆఫర్‌ ప్రకటించింది. ‘బై 2 గెట్‌ 2’ అంటూ సినీ ప్రేమికులకు ఆఫర్‌ ఇచ్చింది. బుక్‌ మై షో యాప్‌లో టికెట్స్‌ బుక్‌ చేసుకునేవారు 'Gadar 2' అనే కోడ్‌ ఉపయోగించి ఈ ఆఫర్‌ను వినియోగించుకోవాలని తెలిపింది. ఈ ఆఫర్‌ సెప్టెంబర్‌ 3వ తేదీ వరకు ఉంటుందని తెలిపారు.

Updated Date - 2023-08-30T16:57:20+05:30 IST