Fighter: ఫైట‌ర్ నుంచి.. హృతిక్ రోష‌న్ అదిరిపోయే లుక్‌

ABN , First Publish Date - 2023-12-04T22:47:57+05:30 IST

హృతిక్ రోష‌న్ తాజాగా న‌టిస్తున్న చిత్రం ఫైట‌ర్. సిద్దార్థ్‌ ఆనంద్ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా హృతిక్ లుక్‌ను, క్యారెక్ట‌ర్ డిటెయిల్స్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు.

Fighter: ఫైట‌ర్ నుంచి.. హృతిక్ రోష‌న్ అదిరిపోయే లుక్‌
fighter hrithik

హృతిక్ రోష‌న్ (Hrithik Roshan)‌ తాజాగా న‌టిస్తున్న చిత్రం ఫైట‌ర్‌(Fighter).. వ‌న్ ఆఫ్ ది మోస్ట్ అవైటెడ్ సినిమాగా ఎన్నో అంచ‌నాలు ఉన్న ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు. సిద్దార్థ్‌ ఆనంద్ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో అనిల్‌ కపూర్‌(Anil Kapoor,), దీపికా పదుకొనే (Deepika Padukone) ప్ర‌ధాన‌ పాత్రల్లో నటిస్తుండ‌గా వయాకామ్‌ 18 స్టూడియోస్‌(Viacom18 Studios)-మార్‌ఫ్లిక్స్‌ పిక్చర్స్‌ సంయుక్త నిర్మిస్తుంది.

అయితే తాజాగా ఈ సినిమా నుంచి హృతిక్ లుక్‌ను, క్యారెక్ట‌ర్ డిటెయిల్స్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. హాలీవుడ్ చిత్రం టాప్ గ‌న్ త‌ర‌హాలో మ‌న దేశం నుంచి మొట్ట‌మొద‌టి సారిగా ఎవియేష‌న్ జాన‌ర్‌లో రూపొందుతున్న ఈసినిమాలో ఆయ‌న ఎయిర్ డ్రాగన్స్ విభాగంలో స్క్వాడ్రన్ లీడర్ షంషేర్ పఠానియా (పాటీ)గా అనే స్క్వాడ్రన్ పైలట్ పాత్ర‌లో కనిపించబోతున్నాడు.


2024 జనవరి 25న రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ ఫైటర్(Fighter) సినిమా టీజర్‌ను డిసెంబర్ 7న విడుదల చేయనున్నారు.ఈ క్ర‌మంలో చిత్ర యూనిట్‌, హృతిక్ సినిమా ప్ర‌మోష‌న్స్ మొద‌లు పెట్టారు. దీని త‌ర్వాత జూ.ఎన్టీఆర్‌తో క‌లిసి చేస్తున్న‌ పాన్ ఇండియా చిత్రం వార్‌2 లో ఆయ‌న న‌టిస్తున్నాడు.

Updated Date - 2023-12-04T22:47:58+05:30 IST