Ektaa kapoor : తన సినిమాపై కామెంట్‌ చేసిన నెటిజన్లకు ఇచ్చి పడేసింది!

ABN , First Publish Date - 2023-10-12T09:27:41+05:30 IST

ఏక్త కపూర్‌(Ekta kapoor)... ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. బాలీవుడ్‌ నిర్మాతల్లో బోల్డ్‌ బ్యూటీ అనొచ్చు. బాలాజీ టెలీఫిల్మ్స్‌ సంస్థకు మేనేజింగ్‌ డైరెక్టర్‌గా, క్రియేటివ్‌ హెడ్‌గా సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్నారు.

Ektaa kapoor : తన సినిమాపై కామెంట్‌ చేసిన నెటిజన్లకు ఇచ్చి పడేసింది!

ఏక్త కపూర్‌(Ekta kapoor)... ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. బాలీవుడ్‌ నిర్మాతల్లో బోల్డ్‌ బ్యూటీ అనొచ్చు. బాలాజీ టెలీఫిల్మ్స్‌ సంస్థకు మేనేజింగ్‌ డైరెక్టర్‌గా, క్రియేటివ్‌ హెడ్‌గా సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్నారు. దీనికి కో కంపెనీగా బాలాజీ మోషన్ పిక్చర్స్‌, ఆల్డ్‌ బాలాజీ సంస్థలను నెలకొల్పి, సినిమా, టీవీ, డిజిటల్‌ రంగంలో దూసుకెళ్తున్నారు. ఏక్తాకపూర్‌ మాటలు ఎంత ఘాటుగా ఉంటాయో.. ఆమె తీసే సినిమాలు, డిజిటల్‌ కంటెంట్‌ కూడా అంతే హాట్‌గా ఉంటాయి. వివాదాలు, విమర్శలు ఆమె కొత్తకాదు. ఆమె మరోసారి విమర్శల పాలైంది. బాలాజీ మోషన పిక్చర్స్‌ బ్యానర్‌పై తాజాగా ఆమె నిర్మించిన చిత్రం ‘థ్యాంక్యూ ఫర్‌ కమింగ్‌’. భూమి ఫడ్నేకర్‌, షెహనాజ్‌గిల్‌ కీలక పాత్రధారులుగా నటించిన ఈ చిత్రానికి కరణ్‌ బూలానీ దర్శకుడు. ఏక్తాకపూర్‌, రియా కపూర్‌, అనిల్‌ కపూర్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సెన్సార్‌ బోర్డ్‌ ఏ సర్టిఫికెట్‌ ఇచ్చింది. ఈ నెల 6న విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఏక్తాకపూర్‌ ట్విట్టర్‌ వేదికగా Q and A సెక్షన్‌ నిర్వహించారు. ఇందులో నెటిజన్లు ఆమెపై విమర్శల వర్షం కురిపించారు. ‘నీ వల్ల ఎంతోమంది యువత చెడిపోతున్నారు. మంచి సినిమాలు చేయడం నేర్చుకో’’ అని పలువురు నెట్టింట కామెంట్‌ చేశారు. విమర్శలను ఇంచు కూడా లెక్క చేయని ఆమె తనదైన శైలిలో ఘాటుగా సమాధానం ఇచ్చింది.

Etha.jpeg

‘నువ్వూ, ఆ కరణ్‌ జోహర్‌ కలిసి చాలామందిని చెడగొడుతున్నారు’, ‘ఇండియాలో ఎంతోమంది విడాకులకు మీరు ఇద్దరే కారణం’ అని ఓ నెటిజన కామెంట్‌ చేశారు. దీనికి ‘ఓ అవునా’ అని కామెంట్‌ చేశారు ఏక్తా కపూర్‌. అనంతరం మరో నెటిజన్‌.. ‘దయచేసి మీరు అడల్ట్‌ సినిమాలు చేయడం మానండి’ అని కోరగా, దీనిపై ఆమె వ్యంగ్యంగా కామెంట్‌ చేశారు. ‘నో. నేనొక అడల్ట్‌. బోల్డ్‌ పర్సనని. కాబట్టి అడల్ట్‌ సినిమాలే చేస్తా’ అని కౌంటర్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఏక్తాకపూర్‌, నెటిజన్లకు మధ్య జరిగిన సంభాషణ వైరల్‌గా మారింది.

Updated Date - 2023-10-12T09:28:16+05:30 IST