Rashmika Mandanna: పాపం రష్మిక, అక్కడా పోయింది, ఇక్కడా పోయింది

ABN , First Publish Date - 2023-08-31T15:07:41+05:30 IST

అదేదో సామెత చెప్పినట్టు, ఒక పెద్ద హిందీ సినిమా కోసం రష్మిక మందన్న ఒక తెలుగు సినిమా కొంత షూటింగ్ చేసాక ఆ సినిమానుండి తప్పుకుంది. ఇప్పుడు ఆ పెద్ద హిందీ సినిమా కూడా పోయింది, పాపం రష్మిక పరిస్థితి ఎలా ఉందంటే...

Rashmika Mandanna: పాపం రష్మిక, అక్కడా పోయింది, ఇక్కడా పోయింది
Rashmika Mandanna

'పుష్ప' #Pushpa విజయంతో రష్మిక మందన్న (RashmikaMandanna) నేషనల్ క్రష్ (NationalCrush) అని పేరు తెచ్చుకుంది. ఆమె దక్షిణాది సినిమాలతో పాటు, హిందీ సినిమాలు కూడా చెయ్యడం మొదలెట్టింది. ఈమధ్యనే హిందీలో అగ్రనటుడు షాహిద్ కపూర్ (ShahidKapoor) పక్కన అనీస్ బాజ్మీ (AneesBazmee) దర్శకత్వంలో ఒక సినిమా షూటింగ్ చెయ్యాల్సి వుండింది. దానికి నిర్మాత దిల్ రాజు (DilRaju), అయితే ఈ సినిమా ఇప్పుడు రద్దు చేసేశారు. షాహిద్ కపూర్ కి, దర్శకుడు అనీస్ కి మధ్య కథాపరంగా ఏవో తేడాలు వచ్చాయని, అలాగే బడ్జెట్ కూడా ఎక్కువయిందని, అందుకని ఈ సినిమా నుండి షాహిద్ కపూర్ తప్పుకున్నాడు అని, అందువల్ల ఈ సినిమా రద్దు చేసేశారని మీడియా కథనాలు చెపుతున్నాయి.

rashmika-mandanna.jpg

ఈ సినిమా మళ్ళీ ఎప్పుడు మొదలవుతుందో ఎవరికీ తేయలీడు. ఎందుకంటే షాహిద్ కపూర్ ప్లేస్ లో వేరే నటుడుని చూడాలి. అసలు చెప్పాలంటే ఈ సినిమాకి 'డబుల్ ట్రబుల్' అనే పేరు కూడా పెట్టినట్టుగా కూడా తెలిసింది. ఈ సినిమా ఇప్పుడు లేకపోవటంతో పాపం రష్మిక కి కూడా షూటింగ్ లేదు. ఒక పెద్ద హిందీ ప్రాజెక్ట్ ఆమె చేతిలోంచి పోయింది. అదీ కాకుండా ఆమె ఒక తెలుగు సినిమా నితిన్ (Nithiin), వెంకీ కుడుముల (VenkyKudumula) కాంబినేషన్ లో చెయ్యాలి, అధికారికంగా రష్మిక కథానాయిక అని చెప్పారు కూడా, కానీ ఆమె ఈ హిందీ సినిమా కోసం ఈ తెలుగు సినిమా వదిలేసుకుంది.

rashmika-mandanna1.jpg

అటు హిందీ సినిమా షెల్ప్ అయిపొయింది, ఇటు తెలుగు సినిమా వదిలేసుకుంది, పాపం ఇప్పుడు రష్మిక రెండు సినిమాలు అనవసరంగా చేజార్చుకుంది. ఇప్పుడు రష్మిక హిందీ సినిమా 'యానిమల్' #Animal విడుదలకి సిద్ధంగా వుంది. ఇందులో ఆమె రణబీర్ (RanbirKapoor) పక్కన చేసింది, దీనికి సందీప్ వంగా (SandeepReddyVanga) దర్శకుడు. అలాగే అల్లు అర్జున్ (AlluArjun) పక్కన నటిస్తున్న 'పుష్ప 2' #Pushpa2 లో కూడా చేస్తోంది. ఇప్పుడు ఈ రెండు సినిమాల మీదే ఎక్కువ ఫోకస్ పెట్టుకుంది ఆమె.

Updated Date - 2023-08-31T15:07:41+05:30 IST