Athiya Shetty: వైభవంగా అతియా, రాహుల్‌ల పెళ్లి

ABN , First Publish Date - 2023-01-23T19:33:34+05:30 IST

బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి (Suniel Shetty) కుమార్తెగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అందాల భామ అతియా శెట్టి (Athiya Shetty). ‘హీరో’ సినిమాతో వెండి తెర పైకి రంగ ప్రవేశం చేసింది.

Athiya Shetty: వైభవంగా అతియా, రాహుల్‌ల పెళ్లి

బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి (Suniel Shetty) కుమార్తెగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అందాల భామ అతియా శెట్టి (Athiya Shetty). ‘హీరో’ సినిమాతో వెండి తెర పైకి రంగ ప్రవేశం చేసింది. ఈ చిత్రం నిరాశ పరిచినప్పటికి ఆమె నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. అతియా శెట్టి, టీమిండియా క్రికెటర్ కేఎల్. రాహుల్ (KL Rahul) మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ లవ్‌బర్డ్స్ తాజాగా పెళ్లి పీటలను ఎక్కారు. సునీల్‌కు ఖండలాలో ఉన్న ఫామ్‌హౌస్‌లో ఈ వివాహం వైభవంగా జరిగింది.

అతియా, రాహుల్ పెళ్లికీ కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఈ వేడుకకు సునీల్ శెట్టి, అతియా సోదరుడు అహాన్ శెట్టి సంప్రదాయ దుస్తుల్లో విచ్చేశారు. పెళ్లి ముగిసిన అనంతరం ఫామ్‌హౌస్ బయట ఉన్న వ్యక్తులకు సునీల్ శెట్టి స్వీట్స్‌ను పంపిణీ చేశాడు. మీడియాతో మాట్లాడాడు. ‘‘పెళ్లి చాలా బాగా జరిగింది. అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. నేను మామయ్యగా ప్రమోషన్ కొట్టేశాను’’ అని సునీల్ చెప్పాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 ముగిసిన అనంతరం భారీ ఎత్తున రిసెప్షన్‌ను ఏర్పాటు చేస్తామన్నాడు. మే లేదా జూన్‌లో కార్యక్రమం జరిగే అవకాశముందన్నాడు. ఈ వేడుకకు బాలీవుడ్ సెలబ్రిటీస్ డయానా పెంటీ, క్రిష్ణ ష్రాఫ్, అన్షులా కపూర్ క్రికెటర్స్ వరుణ్ అరోన్, ఇషాంత్ శర్మ తదితరులు హాజరయ్యారు.

Updated Date - 2023-01-23T20:15:57+05:30 IST