సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NoraFatehi: వరుణ్ తేజ్ పక్కన బాలీవుడ్ హీరోయిన్ నోరా ఫతేహి

ABN, First Publish Date - 2023-07-26T14:02:31+05:30

వరుణ్ తేజ్ కొత్త సినిమా రేపు ప్రారంభం కానుంది. ఇది ఒక పీరియడ్ డ్రామా అని, విశాఖపట్నం నేపధ్యంలో ఈ కథ ఉంటుందని, ఇందులో బాలీవుడ్ నటి నోరా ఫతేహి ఒక ముఖ్య పాత్ర పోషిస్తోందని అధికారికంగా ప్రకటించారు.

Varun Tej and Nora Fatehi

వరుణ్ తేజ్ (VarunTej) వరస సినిమాలతో చాలా బిజీ అయిపోయాడు ఇప్పుడు. ఒకపక్క 'గాండీవధారి అర్జున' #GandeevadhariArjuna విడుదలకి సిద్ధం అవుతోంది, ఇంకోపక్క యుద్ధం నేపథ్యంలో ఒక హిందీ సినిమా చేస్తున్నసంగతి కూడా తెలిసిందే, ఇది పాన్ ఇండియా సినిమాగా విడుదలవుతోంది. ఈ రెండు సినిమాలు ఇలా ఉంటే, ఇప్పుడు దర్శకుడు కరుణ కుమార్ (KarunaKumar) తో ఒక సినిమా చేస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. కరుణ కుమార్ ఇంతకు ముందు 'పలాస 1978' (Palasa1978) అనే సినిమా చేసి మంచి పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు అతను వరుణ్ తేజ్ తో సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించారు. దీనికి మోహన్ చెరుకూరి, విజేందర్ రెడ్డి తీగల నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇది ఒక హై బడ్జెట్ సినిమాగా తెరకెక్కనుంది అని కూడా చెపుతున్నారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ పక్కన బాలీవుడ్ నటి నోరా ఫతేహి (NoraFatehi) నటిస్తున్నటుగా కూడా అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా వరుణ్ తేజ్ కెరీర్ లో ఒక పెద్ద బడ్జెట్ సినిమా అవుతుందని చెపుతున్నారు.

మీనాక్షి చౌదరి (MeenakshiChaudhary) ఈ సినిమాలో కథానాయకురాలిగా చేస్తోందని కూడా తెలుస్తోంది. అలాగే నోరా ఫతేహి (NoraFatehi) కూడా ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో నటించనున్నదని ప్రకటించారు. నోరా ఇంతకుముందు తెలుగులో చాలా స్పెషల్ సాంగ్స్ లో నటించింది, అందులో వరుణ్ తేజ్ తో కూడా 'లోఫర్' #Loafer సినిమాలో కూడా ఒక స్పెషల్ సాంగ్ లో నటించింది. ఇప్పుడు అదే వరుణ్ తేజ్ సినిమాలో ఒక ప్రాముఖ్యం వున్న పాత్ర చేస్తోంది నోరా ఫతేహి.

ఈ సినిమా కథ నేపధ్యం 1960లో జరిగే ఒక పీరియడ్ కథ అని చెప్పారు. అది కూడా విశాఖపట్నం (Visakhapatnam) నేపథ్యంలో ఉంటుంది అని అంటున్నారు, అందుకోసం అని ఆ 1960 లో ప్రదేశాలు ఎలా వుంటాయో, అచ్చం అలాగే తెర మీద చూపించడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు ఈ సినిమా నిర్వాహకులు. ఈనెల 27న ఈ సినిమా లాంచ్ అవుతుందని, ఆరోజు ఈ సినిమా గురించి మరిన్ని విషయాసలు వెల్లడించనున్నారని కూడా చెపుతున్నారు.

Updated Date - 2023-07-26T14:02:31+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!