Selfiee: హీరో, అభిమానికి మధ్య జరిగిన యుద్ధం

ABN , First Publish Date - 2023-01-22T18:14:32+05:30 IST

‘సెల్ఫీ’ ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 24న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. అందులో భాగంగా జనవరి 22న ట్రైలర్‌ను విడుదల చేశారు.

Selfiee: హీరో, అభిమానికి మధ్య జరిగిన యుద్ధం

మలయాళంలో సంచలన విజయం సాధించిన సినిమా ‘డ్రైవింగ్ లైసెన్స్’ (Driving license). ఈ చిత్రాన్ని హిందీలో ‘సెల్ఫీ’ (Selfiee) టైటిల్‌తో రీమేక్ చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్ అక్షయ్ కుమార్ (Akshay Kumar), ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi) హీరోలుగా నటిస్తున్నారు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 24న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. అందులో భాగంగా జనవరి 22న ట్రైలర్‌ను విడుదల చేశారు.

‘సెల్ఫీ’ లో అక్షయ్ కుమార్ సినిమా హీరో పాత్రను పోషించాడు. హీరో అభిమాని, వెహికల్ ఇన్‌స్పెక్టర్ పాత్రలో ఇమ్రాన్ హష్మీ కనిపించాడు. ఇమ్రాన్ ఒక సందర్భంలో అక్షయ్‌ను సెల్ఫీని అడగగా అందుకు అతడు నిరాకరిస్తాడు. ఫలితంగా ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తుతాయి. ఒకరిని మరొకరు ఛాలెంజ్ చేసుకునే పరిస్థితులు వస్తాయి. అక్షయ్ అదే సమయంలో డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేసుకోగా ఇమ్రాన్ హష్మీ ఇబ్బందులు కల్పిస్తుంటాడు. అయితే, లైసెన్స్‌ను పొందడంలో అక్కీ ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు..? చివరకు లైసెన్స్‌ను సాధించాడా లేదా అనే కథాంశంతో చిత్రం రూపొందినట్టు తెలుస్తోంది. సెల్ఫీకి రాజ్ మెహతా దర్శకత్వం వహించాడు. అరుణ్ భాటియా, అపూర్వ మోహతా, హీరు యశ్ జోహార్, సుప్రియ మేనన్, కరణ్ జోహార్, పృథ్వీరాజ్ సుకుమారన్, అపూర్వ మెహతా తదితరులు నిర్మించారు.

Updated Date - 2023-01-22T18:14:34+05:30 IST