మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Bobby Deol : అభిమానుల ప్రేమకు ఫిదా.. భావోద్వేగానికి గురైన బాబీ..

ABN, Publish Date - Dec 04 , 2023 | 02:42 PM

రణ్‌బీర్‌ కపూర్‌ - రష్మిక జంటగా నటించిన చిత్రం ‘యానిమల్‌’. సందీప్‌రెడ్డి వంగా దర్శకుడు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రంలో విలన్ గా  నటించిన బాబీ దేవోల్‌ తన నటనతో ఆకట్టుకున్నారు.

రణ్‌బీర్‌ కపూర్‌ 9Ranbir kapoor)- రష్మిక (Rashmika mandanna) జంటగా నటించిన చిత్రం ‘యానిమల్‌’ (Animal). సందీప్‌రెడ్డి వంగా దర్శకుడు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రంలో విలన్ గా  నటించిన బాబీ దేవోల్‌ తన నటనతో ఆకట్టుకున్నారు. తాజాగా ముంబైలోని ఓ థియేటర్‌కు వెళ్లి ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేశారాయన.. ‘సినిమాకు ఇంతటి విజయాన్ని అందించినందుకు ధన్యవాదాలు. ఎంతో మంది ఆర్టిస్ట్‌ల నటన గురించి ప్రశంసిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే ఓ కలలా ఉంది’ అని ఆనందం వ్యక్తం చేశారు. థియేటర్‌ నుంచి బయటకు వచ్చాక కారులో వెళ్తూ అభిమానులను చూసి ఒక్కసారిగా భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. కళ్లు తుడుచుకుంటూ కార్లో కూర్చున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ సినిమా కోసం బాబీ దేవోల్‌ ఎంతో కఠోర సాధన చేశారనేది ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన ట్రైనర్‌ ప్రజ్వల్‌ చెప్పిన సంగతి తెలిసిందే! ఆ లుక్‌ కోసం మూడు నెలలపాటు స్వీట్లు మానేసి కఠినమైన డైట్‌ ఫాలో అయ్యారు. రణ్‌బీర్‌ కంటే భారీగా కనిపించి ప్రేక్షకులను మెప్పించారు. (Bobby deol gets emotional)

ప్రస్తుతం ఆయన తెలుగు చిత్రాలతో కూడా బిజీ అయ్యారు. పవన్‌ కల్యాణ్‌ హీరోగా తెరకెక్కుతోన్న ‘హరిహరవీరమల్లు’, తమిళంలో కంగువా చిత్రంలో నటిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఓ చిత్రంలోనూ హీరోగా నటిస్తున్నట్లు తెలుస్తోంది.

Updated Date - Feb 20 , 2024 | 12:47 PM