scorecardresearch

Bhumika: వ్యాపారరంగంలోకి.. ఖుషి బ్యూటీ! 

ABN , Publish Date - Dec 31 , 2023 | 04:43 PM

టాలీవుడ్‌ సినిమాతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన ముంబై భామ భూమిక(Bhumika Chawla). యువకుడు సినిమాతో సుమంత సరసన నటించిన ఆమె  ఖుషీ (Kushi) సినిమాతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకుంది.

Bhumika: వ్యాపారరంగంలోకి.. ఖుషి బ్యూటీ! 

టాలీవుడ్‌ సినిమాతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన ముంబై భామ భూమిక(Bhumika Chawla). యువకుడు సినిమాతో సుమంత సరసన నటించిన ఆమె  ఖుషీ (Kushi) సినిమాతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకుంది. అనంతరం మిస్సమ్మ, సింహాద్రి, వాసు, ఒక్కడు లాంటి సూపర్‌ హిట్‌ సినిమాల్లో భాగమైంది. మిస్సమ్మ చిత్రానికి గాను ఉత్తమ నటిగా నంది పురస్కారంఅందుకొంది. . ఒకప్పుడు తెలుగులో స్టార్‌ హీరోయిన్‌గా చేసిన భూమిక ప్రస్తుతం సూటబుల్‌ క్యారెక్టర్‌ రోల్స్‌తో మెప్పిస్తోంది. ఎంఎస్‌ ధోని చిత్రంలో సుశాంత్‌కు అక్కగా నటించి మెప్పించింది. ప్రస్తుతం కంగనా రనౌత్‌ నటిస్తోన్న ఎమర్జన్సీ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది. 

ఒకపక్క సినిమాలతో బిజీగా ఉంటున్న భూమిక తాజాగా వ్యాపారరంగంలోకి అడుగుపెట్టింది. 'సమర వెల్‌నెస్‌' (Samara Wellness) పేరుతో గోవాలో  ఓ హోటల్‌ ప్రారంభించారు. ఈ విషయాన్ని తన ఇన్‌స్టా వేదికగా పంచుకుంది. గోవాలో కొత్త హోటల్‌ను ప్రారంభించినట్లు సోషల్‌ మీడియా ద్వారా  తెలిపింది. అబిమానులు ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు


Updated Date - Dec 31 , 2023 | 04:44 PM