Actress Allegations on Hero: ‘రాత్రి 9కి కాల్ చేసి.. ఆ స్టార్ హీరో నన్ను వేధించాడు’
ABN , First Publish Date - 2023-01-06T10:46:38+05:30 IST
భోజ్‌పురి (Bhojpuri) సినిమా సూపర్‌స్టార్ పవన్‌సింగ్ (Pawan Singh)పై నటి యామినీ సింగ్ (Yamini Singh) తీవ్ర ఆరోపణలు చేసింది. అతనితో కలిసి పనిచేయడం ఇష్టం లేదని యామినీ సింగ్ చెప్పింది.
భోజ్‌పురి (Bhojpuri) సినిమా సూపర్‌స్టార్ పవన్‌సింగ్ (Pawan Singh)పై నటి యామినీ సింగ్ (Yamini Singh) తీవ్ర ఆరోపణలు చేసింది. అతనితో కలిసి పనిచేయడం ఇష్టం లేదని యామినీ సింగ్ చెప్పింది. ఎందుకంటే ఆయన సినిమాల్లో నటీమణులకు సరైన పాత్ర దక్కదని గత కొన్నేళ్ల క్రితం ఆమె తెలిపింది. నిజానికి పవన్‌తో కలిసి పని చేయకపోవడానికి కారణం వేరే ఉందని యామిని ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. పవన్ సింగ్ తనని రాజీ పడమని అడిగినట్లు యామిని తెలిపింది.
యామిని మాట్లాడుతూ.. ‘అతను నాకు సినిమా అవకాశం ఇచ్చాడని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. అది పూర్తిగా తప్పు. నా మొదటి సినిమా ‘బాస్’ అవకాశాన్ని దర్శకుడు అరవింద్ చౌబే ఆఫర్ చేశారు. ఈ చిత్రం నుండి నన్ను ఎవరూ తొలగించలేదు. నేనే ఆ చిత్రాన్ని వదులుకున్నాను. పవన్ చాలా మంచివాడని, మంచి యాక్టర్ అని అప్పటికి నాకు తెలుసు. అతని మంచి సింగర్ కూడా. అదే సెట్స్‌లో మొదటి సారి కలిసినప్పుడు అతనికి చెప్పాను. అప్పటి వరకు అతని గురించి నాకు నిజం తెలియదు. ఇప్పుడు నేను తన అభిమానులను అడగాలనుకుంటున్నాను. ఎవరైనా వారి తల్లి, సోదరి, కుమార్తెను అతను ఇలాంటి పని చేయమని అడిగితే.. అతన్ని ఇంకా అభిమానిస్తారా?’ అని అడిగింది.
యామిని ఇంకా మాట్లాడుతూ.. ‘అతను ఓ సారి రాత్రి 9 గంటల ప్రాంతంలో నాకు కాల్ చేశాడు. ఆటోలో స్టూడియోకి రమ్మని అడిగాడు. ఈ టైమ్‌లో రాలేనని చెబితే.. సినిమా చేయాలని ఉందా లేదా?.. అని హెచ్చరించాడు. అప్పుడు కాల్ కట్ చేసి.. సినిమా నుంచి తప్పుకున్నాను’ అని తెలిపింది.