Chatrapathi: ప్రభాస్ కి సరిసమానంగా బెల్లంకొండ శ్రీనివాస్

ABN , First Publish Date - 2023-05-02T17:08:53+05:30 IST

తెలుగులో ప్రభాస్ ని స్టార్ ని చేసిన సినిమా 'ఛత్రపతి', దీనికి రాజమౌళి దర్శకుడు. ఇదే సినిమా ఇప్పుడు రాజమౌళి స్నేహితుడు వినాయక్, బెల్లంకొండ శ్రీనివాస్ ని హిందీ పరిశ్రమకి పరిచయం చేస్తూ తీసాడు. ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉందంటే...

Chatrapathi: ప్రభాస్ కి సరిసమానంగా బెల్లంకొండ శ్రీనివాస్

తెలుగులో రాజమౌళి (SS Rajamouli) తీసిన 'ఛత్రపతి' (Chatrapathi) పెద్ద విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇందులో నటించిన ప్రభాస్ (Prabhas) ఈ సినిమా నుండి స్టార్ గా ఎదిగాడు. ఇదే సినిమాని ఇప్పుడు రాజమౌళి స్నేహితుడు దర్శకుడు వివి వినాయక్ (VV VInayak) హిందీలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sreenivas) ని లీడ్ యాక్టర్ గా హిందీ పరిశ్రమకి పరిచయం చేస్తూ తీస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్ ఈరోజు విడుదల అయింది. బెల్లంకొండ శ్రీనివాస్ హిందీ ప్రేక్షకులకు పరిచయం వున్న నటుడే, ఎందుకంటే అతని తెలుగు సినిమాలు అన్నీ హిందీ లోకి తర్జుమా చెయ్యబడినవి యూట్యూబ్ లో అత్యధికంగా చూసారు.

bellamkondasreenivas.jpg

అందుకని శ్రీనివాస్ పేరు అక్కడ పరిచయమున్న పేరు. ఇప్పుడు ఈ 'ఛత్రపతి' #ఛత్రపతి కూడా ఒక యాక్షన్ సినిమా, ఇందులో అమ్మ సెంటిమెంట్ ఉంటుంది. తెలుగు ఛత్రపతి ప్రభాస్ చేసేటప్పటికి ఇంకా ప్రభాస్ కి స్టార్ డమ్ రాలేదు. ఆ సినిమాతో వచ్చింది. హిందీ ఛత్రపతి ట్రైలర్ చూసినప్పుడు శ్రీనివాస్, ప్రభాస్ తో సమానంగా బాగా చేసాడు అనిపించింది. ఇది యాక్షన్ సినిమా అని తెలుసు కదా, అందుకని దానికి తగ్గట్టుగానే శ్రీనివాస్ తన బాడీని, ఫిజిక్ ని బాగా తయారుచేసుకున్నాడు ఈ సినిమా కోసం. ప్రభాస్ కి ఎలా అయితే పేరు వచ్చిందో, ఈ హిందీ రీమేక్ నుండి శ్రీనివాస్ కి అలంటి పేరే వస్తుందని అనుకుంటున్నారు.

bellamkondasreenivas2.jpg

ఇందులో పోరాట సన్నివేశాలు చాలామట్టుకు దక్షిణాదికి చెందిన వాళ్ళే కోరియోగ్రఫీ చెయ్యడం విశేషం. అనల్ అరసు, రామ్ లక్ష్మణ్, రామ్ సుంకర, చేతన్ డిసౌజా లు పోరాటమా సన్నివేశాలని కోరియోగ్రఫీ చేశారు. ట్రైలర్ లో యాక్షన్ సన్నివేశాలు అయితే బాగున్నాయి, మామూలుగా అయితే హిందీ ప్రేక్షకులకి యాక్షన్ సన్నివేశాలు బాగా నచ్చుతాయి కాబట్టి, ఈ సినిమా కూడా వాళ్ళకి నచ్చుతుందని అనుకుంటున్నారు.

వి.వి. వినాయక్ ఒక నటుడుని మాస్ ఇమేజ్ లో ఎలా చూపించాలో బాగా తెలుసు. ఎదో ఒకటి రెండు సినిమాలు మధ్యలో పోయిన, అతనిలోని టాలెంట్ అయితే ఈ సినిమాతో మళ్ళీ బయటకి వస్తుంది అని అనుకుంటున్నారు. ఇందులో నుష్రత్ భరూచా (Nushrratt Bharuccha) కథానాయకురాలిగా వేస్తోంది.

Updated Date - 2023-05-02T17:11:14+05:30 IST