Atlee : తదుపరి చిత్రం మల్టీస్టారర్‌.. ఎవరితో అంటే!

ABN , First Publish Date - 2023-11-14T17:11:12+05:30 IST

‘జవాన్‌’తో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను అలరించారు దర్శకుడు అట్లీ. ప్రస్తుతం ఆయన తదుపరి చిత్రం గురించే ఎక్కువ చర్చ నడుస్తోంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అట్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దళపతి విజయ్‌, షారుక్‌తో ఓ మల్టీస్టారర్‌ చిత్రం తీసేందుకు రెడీ అవుతున్నట్లు చెప్పారు.

Atlee : తదుపరి చిత్రం మల్టీస్టారర్‌.. ఎవరితో అంటే!


‘జవాన్‌’తో (Jawan) ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను అలరించారు దర్శకుడు అట్లీ (atlee). ప్రస్తుతం ఆయన తదుపరి చిత్రం గురించే ఎక్కువ చర్చ నడుస్తోంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అట్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దళపతి విజయ్‌, షారుక్‌తో ఓ మల్టీస్టారర్‌ (multistatrer) చిత్రం తీసేందుకు రెడీ అవుతున్నట్లు చెప్పారు. "ప్రస్తుతం ఈ మలీస్ట్టారర్‌ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ తో  బిజీగా  ఉన్నాం. త్వరలోనే ఇది తెరకెక్కే అవకాశాలున్నాయి.

తాజాగా ఓ పార్టీలో విజయ్‌, షారుక్‌ ఖాన్‌ (Shah rkukh నా సినిమాల గురించి మాట్లాడుకొని నాకు ఫోన్‌ చేశారు. మల్టీస్టారర్‌  తీసే ఆలోచన ఉంటే.. అందులో తాను నటించడానికి ఆసక్తిగా ఉన్నట్లు షారుక్‌ చెప్పారు. అలాగే విజయ్‌ కూడా ఇదే మాట అన్నారు. అందుకే వాళ్లిద్దరితో ఓ మల్టీస్టారర్‌ చేయాలని నిర్ణయించుకున్నా. ఇదే నా తదుపరి చిత్రం అవుతుంది. రూ.3000 కోట్లు వసూళ్లు చేసే  చిత్రమవుతుంది. ఈ ఇద్దరిలో ఎవరు ముఖ్యమంటే నేను చెప్పలేను. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండడానికి తొలి కారణం విజయ్‌.. నాపై నమ్మకంతో అవకాశాలిచ్చారు’’ అని అట్లీ అన్నారు. అంతేకాదు హాలీవుడ్‌ నుంచి ఓ ప్రముఖ స్టూడియో తనను సంప్రదించినట్లు, ప్రస్తుతం ఆ పనులు కూడా జరుగుతున్నట్లు అట్లీ చెప్పారు. 

Updated Date - 2023-11-14T17:20:08+05:30 IST