Atlee : ఎంతో ఒత్తిడికి గురయ్యాను.. ఎంత మెరుగయ్యానో నాకే తెలుసు!

ABN , First Publish Date - 2023-10-28T13:45:35+05:30 IST

తమిళ దర్శకుడు అట్లీ మాంచి జోరు మీదున్నాడు. బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ఖాన్ తో చేసిన ‘జవాన్‌’ సూపర్‌హిట్‌గా నిలిచి రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. 50 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పటికీ పలు థియేటర్స్‌లో సందడి చేస్తు వసూళ్లు రాబడుతోంది. ఇప్పటి వరకు రూ.1,145 కోట్ల కలెక్షన్స్‌ రాబట్టింది. తాజాగా దీనిపై అట్లీ ట్వీట్‌ చేశాడు

Atlee : ఎంతో ఒత్తిడికి గురయ్యాను.. ఎంత మెరుగయ్యానో నాకే తెలుసు!

తమిళ దర్శకుడు అట్లీ మాంచి జోరు మీదున్నాడు. బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ఖాన్ తో (Shah Rukh Khan) చేసిన ‘జవాన్‌’ (Jawan) సూపర్‌హిట్‌గా నిలిచి రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. 50 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పటికీ పలు థియేటర్స్‌లో సందడి చేస్తు వసూళ్లు రాబడుతోంది. ఇప్పటి వరకు రూ.1,145 కోట్ల కలెక్షన్స్‌ రాబట్టింది. తాజాగా దీనిపై అట్లీ ట్వీట్‌ చేశాడు. అలాగే బాలీవుడ్‌లో తొలి ప్రాజెక్ట్‌ షారుక్‌లాంటి స్టార్‌తో చేయడం ఎంతో ఆనందాన్నిచ్చిందని చెప్పారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో షారుక్‌, దీపికపై అట్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘‘సామాన్యుడిగా, దర్శకుడిగా నేను అత్యంత ఇష్టపడే నటుడు షారుక్‌ఖాన్. ఆయన గొప్ప నటుడే కాదు.. గొప్ప నిర్మాత కూడా. ఖర్చు విషయంలో ఎక్కడా కాంప్రమైజ్‌ కారు. దర్శకుల దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు, తోటి నటీనటుల వరకూ అందరినీ ఎంతో ఎంకరేజ్‌ చేస్తారు. ఆయనతో పని చేస్తే ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. ‘జవాన్‌’ తర్వాత నా సినిమా భావజాలం గ్రాఫ్‌ ఎంతో మెరుగయ్యాయి. దర్శకుడిగా నా ఐదో సినిమానే ఆయనతో చేయడం ఎంతో అదృష్టం. వృత్తి పరంగానే కాకుండా వ్యక్తిగతంగానూ నేనెంతో ఆనందంగా ఉన్నా. ఈ సినిమా విడుదలకు ముందు ఎంతో ఒత్తిడికి గురయ్యాను. అది ఎప్పటికీ మరచిపోలేను. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పూర్తయ్యాక షారుక్‌తో కలిసి ‘జవాన్‌’ చూశాను. మా ప్రయత్నం వంద శాతం చేశామని దేవుడిని ప్రార్థించాం. అదే సక్సెస్‌ని ఇచ్చింది’’ అని అన్నారు. ఇంకా దీపికా పడుకోన గురించి కూడా అట్లీ చెప్పుకొచ్చారు ుూఈ కథ చెప్పగానే ఆమె అంగీకరించారు. కళ్లతోనే హావభావాలు పలికించడం ఆమెలో ఉన్న గొప్ప ప్రతిభ. సన్నివేశంలో ఏదన్నా మార్పు చెబితే వెంటనే మౌల్డ్‌ అయిపోతుంది. దానికి తగట్టు లుక్స్‌ మార్చి పాత్రలో లీనమైపోతుంది. అందుకే డైలాగులు చెప్పే సమయంలో ఎక్కువగా క్లోజప్‌ షాట్స్‌ తీశాను’’ అని తెలిపారు.

Updated Date - 2023-10-28T13:45:35+05:30 IST