Athiya Shetty: కేఎల్. రాహుల్, అతియా శెట్టిల పెళ్లికి ముహుర్తం ఫిక్స్!

ABN , First Publish Date - 2023-01-06T19:51:02+05:30 IST

సునీల్ శెట్టి కూమార్తెగా ఇండస్ట్రీకీ ఎంట్రీ ఇచ్చిన అందాల భామ అతియా శెట్టి (Athiya Shetty). హీరో సినిమాతో వెండితెర పైకి రంగప్రవేశం చేసింది. అతియా కొంతకాలంగా ఇండియన్ క్రికెటర్ కేఎల్. రాహుల్ (KL Rahul)తో ప్రేమాయణం నడుడపుతోంది.

Athiya Shetty: కేఎల్. రాహుల్, అతియా శెట్టిల పెళ్లికి ముహుర్తం ఫిక్స్!

సునీల్ శెట్టి కూమార్తెగా ఇండస్ట్రీకీ ఎంట్రీ ఇచ్చిన అందాల భామ అతియా శెట్టి (Athiya Shetty). హీరో సినిమాతో వెండితెర పైకి రంగప్రవేశం చేసింది. అతియా కొంతకాలంగా ఇండియన్ క్రికెటర్ కేఎల్. రాహుల్ (KL Rahul)తో ప్రేమాయణం నడుపుతోంది. ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనున్నాని గత ఏడాది కాలంగా రూమర్స్ హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా ఈ వదంతులే నిజమని తెలుస్తోంది. అతియా, రాహుల్ పెళ్లికి ముహుర్తం ఫిక్స్ అయినట్టు బాలీవుడ్ మీడియా తెలుపుతోంది.

అతియా శెట్టి, కేఎల్. రాహుల్‌ల వివాహం సునీల్ శెట్టి నివాసంలో జరగబోతున్నట్టు సమాచారం. ఖండలాలోని జహాన్‌లో ఉన్న ఇల్లు వీరి పెళ్లికి వేదిక కానున్నట్టు తెలుస్తోంది. ఈ జంట జనవరి 21 నుంచి జనవరి 23 మధ్య ఏడడుగులు వేయనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వేడుకుకు అత్యంత సన్నిహితులు, మిత్రులు మాత్రమే హాజరుకానున్నారట. ఈ వార్త తెలియడంతోనే సునీల్ శెట్టి అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు. అతియా, రాహుల్ న్యూ ఇయర్‌ను దుబాయ్‌లో సెలబ్రేట్ చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ పిక్స్ అన్ని నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ జంట అభిమానులందరు విపరీతంగా షేర్ చేయడం మొదలుపెట్టారు. తాము ప్రేమించుకుంటున్నామని నవంబర్ 2021లో ఈ జంట సోషల్ మీడియా వేదికగా తెలిపారు. బాలీవుడ్ స్టార్స్ కియారా అడ్వాణీ, సిద్దార్థ్ మల్హోత్రా ఫిబ్రవరిలోనే పెళ్లి చేసుకోనున్నారు. ఈ మధ్యనే బీ టౌన్ సెలబ్రిటీ డిజైనర్ మనీశ్ మల్హోత్రా నివాసాన్ని ఈ జంట సందర్శించారు. కియారా, సిద్దార్థ్ పెళ్లి తేదీ మాత్రం బయటకు రాలేదు.

Updated Date - 2023-01-06T19:53:06+05:30 IST