Anushka Sharma : అనుష్క మరోసారి తల్లి కానుందంటూ.. వైరల్‌!

ABN , First Publish Date - 2023-09-30T14:30:56+05:30 IST

టీమ్‌ ఇండియా మాజీ కెప్టెన విరాట్‌ కోహ్లీ (Virat kohli), బాలీవుడ్‌ బ్యూటీ అనుష్కశర్మ కొన్నేళ్ల ప్రేమాయణం తర్వాత 2017లో మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. ఇద్దరూ ఎవరి వృత్తిలో వారు బిజీగా గడుపుతున్నారు.

Anushka Sharma : అనుష్క మరోసారి తల్లి కానుందంటూ.. వైరల్‌!

టీమ్‌ ఇండియా మాజీ కెప్టెన విరాట్‌ కోహ్లీ (Virat kohli), బాలీవుడ్‌ బ్యూటీ అనుష్కశర్మ కొన్నేళ్ల ప్రేమాయణం తర్వాత 2017లో మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. ఇద్దరూ ఎవరి వృత్తిలో వారు బిజీగా గడుపుతున్నారు. 2021లో ఈ దంపతులు వామిక అనే బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే! ఇప్పుడు ఈ జంట మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారనే వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఆ గుడ్‌న్యూస్‌ త్వరలోనే బయటకు రాబోతుందనే వార్త కూడా వైరల్‌ అవుతోంది. అనుష్క ప్రస్తుతం గర్భవతి అని సోషల్‌ మీడియాలో వార్తలు ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ విషయంపై అనుష్క, విరాట్‌ కోహ్లీ ఎక్కడ ప్రకటించలేదు. త్వరలోనే ఈ వార్త బయటకు వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. నవంబర్‌ 5న విరాట్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ శుభవార్తను అభిమానులతో పంచుకుంటారని భావిస్తున్నారు.

Anushkaaaaa' (2).jpeg

ఈ ఽమధ్యకాలంలో అనుష్క కూడా బయటి ప్రైవేట్‌ పార్టీల్లో ఎక్కడా కనిపించడం లేదు. కెమెరాకు చిక్కిందీ లేదు. దాంతో ఈ వార్తకు మరింత బలం చేకూరినట్లయింది. ప్రస్తుతం అనుష్క శర్మ బాలీవుడ్‌ స్పోర్ట్స్‌ ఇతివృత్తంతో రూపొందుతున్న ఓ చిత్రంలో నటిస్తోంది.

Updated Date - 2023-09-30T14:32:05+05:30 IST