Casting Couch: ‘నన్ను ఓ సారి తాకనివ్వు’.. బిగ్‌బాస్ నటుడికి లైంగిక వేధింపులు

ABN , First Publish Date - 2023-01-30T15:45:59+05:30 IST

క్యాస్టింగ్ కౌచ్ (casting couch).. ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్న మాట. ప్రతి రంగంలో ఎంతోమందికి ఇలాంటి అనుభవాలు ఎదురవుతుంటాయి.

Casting Couch: ‘నన్ను ఓ సారి తాకనివ్వు’.. బిగ్‌బాస్ నటుడికి లైంగిక వేధింపులు

క్యాస్టింగ్ కౌచ్ (casting couch).. ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్న మాట. ప్రతి రంగంలో ఎంతోమందికి ఇలాంటి అనుభవాలు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో అది కాస్తా ఎక్కువనే చెప్పాలి. అయితే ఇప్పటి వరకూ మహిళలకి మాత్రమే ఇలాంటి అనుభవాలు ఉంటాయని అందరూ అనుకుంటారు. కానీ మగవాళ్లకి సైతం ఇలాంటి లైంగిక వేధింపులు ఎదురవుతుంటాయి. తాజాగా టీవీ పరిశ్రమలో తనకి ఎదురైన షాకింగ్ అనుభవాల గురించి బిగ్‌బాస్ ఫేమ్ అంకిత్ గుప్తా (Ankit Gupta) తెలియజేశాడు.

అంకిత్ ఇటీవలే హిందీ బిగ్‌బాస్ ఓటీటీ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. ఈ తరుణంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ క్యాస్టింగ్ కౌట్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడుతూ.. ‘నిజాయతీగా ఉంటే అవకాశాలు రావని నాకు చాలామంది చెప్పారు. మంచి అవకాశాల కోసం కచ్చితంగా కాంప్రమైజ్ అవ్వాలని బలవంతం చేశారు. అంతేకాకుండా.. టీవీ, సినీ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్ల పేర్లు చెప్పి.. వారందరూ అలా కాంప్రమైజ్ అయినా వాళ్లేనని.. అలా ఎంతోమంది స్టార్లుగా చేశామని చెప్పారు. అయితే నేను అలాంటి వాడిని కాదని ఒప్పుకోలేదు. అయితే ఒకతను కనీసం నన్ను ముట్టుకోనివ్వమని అంటూ.. నన్ను తడమడం ప్రారంభించాడు. అదే నా జీవితంలో ఎదురైన చెత్త అనుభవం’ అని చెప్పుకొచ్చాడు. కాగా.. బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయినా వెంటనే వేరే షోలో అంకిత్‌కి అవకాశం వచ్చినట్లు సమాచారం.

Updated Date - 2023-01-30T15:46:01+05:30 IST