Ranbir Kapoor: 'యానిమల్' టీజర్ ఎప్పుడనేది చెప్పేసారు

ABN , First Publish Date - 2023-09-18T12:42:43+05:30 IST

రణబీర్ కపూర్, రష్మిక మందన్న లీడ్ పెయిర్ గా, 'అర్జున్ రెడ్డి' ఫెమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకుడిగా వస్తున్న 'యానిమల్' టీజర్ విడుదల తేదీని ప్రకటించారు.

Ranbir Kapoor: 'యానిమల్' టీజర్ ఎప్పుడనేది చెప్పేసారు
Ranbir Kapoor in Animal

దక్షిణాదికి చెందిన దర్శకులు ఇప్పుడు బాలీవుడ్ లో చాలా విజయాలు సాధిస్తున్నారు. తాజాగా అట్లీ (Atlee) 'జవాన్' #Jawan సినిమాతో షారుఖ్ ఖాన్ (ShahRukhKhan) కి ఒక పెద్ద ఘన విజయం అందిస్తే, ఇంకో దర్శకుడు సందీప్ వంగా (SandeepVanga) తన సినిమా 'యానిమల్' #Animal రణబీర్ కపూర్ (RanbirKapoor) తో చేస్తున్నాడు. ఈ సినిమా కోసం కూడా చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో దక్షిణాదికె చెందిన రష్మిక మందన్న (RashmikaMandanna) కథానాయికగా చేస్తోంది. ఈ సినిమా లుక్ ఆమధ్య విడుదలచేసినప్పుడు దానికి అనూహ్యమైన స్పందన వచ్చింది.

ఇప్పుడు ఈ సినిమా టీజర్ విడుదలచేయాలని ఈ 'యానిమల్' టీం భావిస్తోంది. ఎప్పుడు విడుదల చేస్తున్నారు అంటే సెప్టెంబర్ 28న, ఆరోజు స్పెషల్ ఏంటంటే ఈ సినిమా కథానాయకుడు రణబీర్ కపూర్ పుట్టినరోజు అవటం. అందుకనే ఈ సినిమా టీజర్ కూడా అదే రోజు విడుదల చెయ్యడానికి టీము సంసిద్ధం అవుతోంది. ఈరోజు వినాయక చవితి సందర్భంగా టీము టీజర్ విడుదల తేదీని ప్రకటించడం ఆసక్తికరం.

ranbirkapoor.jpg

సందీప్ రెడ్డి వంగా ఇంతకు ముందు 'కబీర్ సింగ్' #KabirSingh హిందీ సినిమా చేసి హిట్ కొట్టాడు. ఇందులో షాహిద్ కపూర్ (ShahidKapoor) కథానాయకుడు, కాగా కియారా అద్వానీ (KiaraAdvani) కథానాయిక. ఇది తెలుగు సినిమా 'అర్జున్ రెడ్డి' #ArjunReddy కి రీమేక్, తెలుగులో కూడా సందీప్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఎప్పుడైతే పెద్ద హిట్ అయిందో, సందీప్ కి హిందీలో బాగా గిరాకీ పెరిగింది. ఇప్పుడు ఈ 'యానిమల్' సినిమా చేస్తున్నాడు, ఇది షూటింగ్ పూర్తయి డిసెంబర్ 1న విడుదలకి సిద్ధంగా వుంది.

Updated Date - 2023-09-18T12:42:43+05:30 IST