Animal : అక్కడ 'బాహుబలి'ని దాటేసింది!

ABN , First Publish Date - 2023-12-05T20:39:38+05:30 IST

ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘యానిమల్‌’ చిత్రం హీరో రణ్‌బీర్‌ కపూర్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. మంచి వసూళ్లను సాధిస్తూ రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పుడీ చిత్రం ‘బాహుబలి-2’ రికార్డును బ్రేక్‌ చేసింది.

Animal : అక్కడ 'బాహుబలి'ని దాటేసింది!

ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘యానిమల్‌’ (Animal) చిత్రం హీరో రణ్‌బీర్‌ కపూర్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. మంచి వసూళ్లను సాధిస్తూ రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పుడీ చిత్రం ‘బాహుబలి-2’(Bahubali2) రికార్డును బ్రేక్‌ చేసింది. సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఓవర్సీస్‌లో 633 థియేటర్లలో విడుదల చేశారు. అక్కడ నాలుగు రోజుల్లో ఏకంగా ఏడు లక్షల డాలర్లకు పైగా ఈ చిత్రం వసూళ్లు రాబట్టింది. దీంతో వసూళ్లలో ‘బాహుబలి-2’ రికార్డును అధిగమించింది. ‘బాహుబలి-2’ అక్కడ ఐదు లక్షల డాలర్లు కలెక్ట్‌ చేసింది. (Collections records)

ఆ రికార్డును సందీప్‌ వంగా ‘యానిమల్‌’ కేవలం నాలుగు రోజుల్లోనే అధిగమించడం విశేషం. ఈ ఏడాది ఓవర్సీస్‌లో ఏడు లక్షల డాలర్ల కలెక్షన్స్‌ సాధించిన ఐదో భారతీయ చిత్రంగా ‘యానిమల్‌’ నిలిచింది. ‘యానిమల్‌’ ఇప్పటిదాకా మొత్తం రూ.425కోట్ల (గ్రాస్‌) వసూళ్లు చేసినట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ హవా ఇలాగే కొనసాగితే రెండు రోజుల్లో రూ.500కోట్లు సాధించడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - 2023-12-05T20:40:05+05:30 IST