scorecardresearch

Alia Bhatt: మరోసారి గర్భవతైన ఆలియా..!?

ABN , First Publish Date - 2023-01-23T12:23:04+05:30 IST

బాలీవుడ్‌లోని క్రేజీ కపుల్స్‌లో అలియా భట్‌ (Alia Bhatt), రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) జంట ఒకటి.

Alia Bhatt: మరోసారి గర్భవతైన ఆలియా..!?
Alia Bhatt

బాలీవుడ్‌లోని క్రేజీ కపుల్స్‌లో అలియా భట్‌ (Alia Bhatt), రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) జంట ఒకటి. దాదాపు ఐదేళ్ల ప్రేమాయణం తర్వాత ఈ జంట గతేడాది ఏప్రిల్‌లో వివాహబంధంతో ఒకటయ్యారు. అంతేకాకుండా.. కొన్ని నెలల క్రితం ఈ జంటకి ఓ కూతురు కూడా పుట్టింది. ఆమెకి రాహా (Raha) అని పేరు కూడా పెట్టుకున్నారు. అంతేకాకుండా ఈ జంట మొదటిసారి కలిసి నటించిన ‘బ్రహ్మాస్త్ర’ గతేడాది విడుదలై మంచి విజయాన్ని సాధించింది. కాగా.. తాజాగా ఈ కపుల్ గురించి ఓ క్రేజీ వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

మూడు నెలల క్రితమే రాహాకి జన్మనిచ్చిన ఆలియా మరోసారి గర్భవతైనట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ బ్యూటీ ఇటీవల ఓ దుస్తుల కంపెనీ కోసం ప్రచారం చేసినట్లు తెలుస్తోంది. అందులో కొత్త మెటర్నిటీ కలెక్షన్స్‌ను లాంఛ్‌ చేసినట్లు సమాచారం. ఇది చూసిన కొందరు ఈ భామ మళ్లీ ప్రెగ్నెంట్ అయ్యిందని అనుకుని ఈ ప్రచారానికి తెర తీసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. కాగా.. అటు ఆలియాగానీ, ఇటు రణ్‌బీర్‌గానీ ఈ విషయంపై స్పందించలేదు.

కాగా.. రణ్‌బీర్ కపూర్, అలియా భట్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్‌లో చాలా బిజీగా ఉన్నారు. ఆలియా ప్రస్తుతం రణ్‌వీర్ సింగ్ సరసన ‘రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ’లో.. అలాగే గాల్ గాడెట్‌తో కలిసి ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ అనే హాలీవుడ్ చిత్రంలోనూ నటిస్తోంది. అలాగే కత్రినా, ప్రియాంకతో కలిసి ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో ‘జీ లే జరా’లో కూడా నటించనుంది. మరోవైపు.. రణ్‌బీర్ ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘యానిమల్’, అలాగే శ్రద్ధాకపూర్‌తో కలిసి ఓ రోమ్-కామ్‌లో నటిస్తున్నాడు.

Updated Date - 2023-01-23T12:23:05+05:30 IST