Alia Bhatt Fire: నాకు అనిపించిందే చేస్తా.. నెపోటిజంపై కామెంట్స్‌

ABN , First Publish Date - 2023-05-12T12:28:55+05:30 IST

ఆలియాభట్‌ ఎంత సాఫ్ట్‌గా కనిపిస్తారో... అంతే కోపమూ ఆమెలో ఉంది. ముఖ్యంగా మహిళలను ఎవరైనా వేలెత్తి చూపితే ఆమె అసలు ఊరుకోదు. వెంటనే కౌంటర్‌ ఇచ్చేస్తుంది.

Alia Bhatt Fire: నాకు అనిపించిందే చేస్తా.. నెపోటిజంపై కామెంట్స్‌

ఆలియాభట్‌ (Alia Bhatt) ఎంత సాఫ్ట్‌గా కనిపిస్తారో... అంతే కోపమూ ఆమెలో ఉంది. ముఖ్యంగా మహిళలను ఎవరైనా వేలెత్తి చూపితే ఆమె అసలు ఊరుకోదు. వెంటనే కౌంటర్‌ ఇచ్చేస్తుంది. ఏ వేదికపైన అయినా ఆడవాళ్లను ఉద్దేశించి మాట్లాడకూడని విషయాలు, కించపరిచే వ్యాఖ్యలు చేస్తే ఆమె కోపం కట్టలు తెంచుకుంటుంది. తాజాగా ఇలాంటి పరిస్థితి ఆమెకు ఎదురైంది. ‘‘కెరీర్‌లో మంచి అవకాశాలు అందుకుంటూ, టర్నింగ్‌ పాయింట్‌గా ఉన్న సమయంలో తల్లి కావాలని ఎందుకు అనిపించింది? అని ఒకరు ప్రశ్నించారు. దీనికి ఆలియా ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ‘‘ఇదే ప్రశ్న మీరు హీరోలను ఎందుకు అడగరు. వారి ముందు ఎందుకు అడగలేకపోతున్నారు. ఇప్పటివరకూ పాపకు సంబంధించిన చాలా విషయాలను రణ్‌బీర్‌ను అడిగారు. కానీ ఎప్పుడూ ఈ ప్రశ్న ఆయన్ని అడగలేదు. (Alia Bhatt Fire on Media) ఇలాంటి పిచ్చి ప్రశ్నలను హీరోయిన్లనే ఎందుకు అడుగుతారు. నేను కెరీర్‌ మొదలుపెట్టిన 10 ఏళ్లకు పిల్లని కన్నాను. నేను ఇప్పుడు మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నా. ఇది ఎంతో ఆనందంగా ఉంది. వ్యక్తిగత, వృత్తి పరమైన నిర్ణయం ఏది తీసుకున్నా.. అది సరైంది అనిపిప్తేనే ముందుకెళ్తాను. నాకు నచ్చకుండా ఏ పనీ చేయను. కథలు నచ్చక ఎన్నో పెద్ద సినిమాల అవకాశాలు వదులుకున్న సందర్భాలెన్నో ఉన్నాయి. మరోసారి ఇలా అడగకండి’’ అని ఘాటుగా స్పందించింది. (bollywood nepotism)

నెపోటిజం (Nepotism) గురించి కూడా ఆమె స్పందించారు. ‘‘నాకు సినిమా బ్యాగ్రౌండ్‌ ఉంది కాబట్టి సినిమాల్లో ఎంట్రీ చాలా ఈజీగా జరిగిందనే విషయం నాకు తెలుసు. చాలామందికి ఆ అవకాశం ఉండదు. నా కలల్ని నేను ఇతరుల కలలతో పోల్చుకుంటాను. కల పెద్దది, చిన్నది అని ఉండదు. ప్రతి ఒక్కరికి కల, కోరిక ఒకటే ఉంటుంది. అనుకున్నది సాధించడం. అది సాకారం చేసుకోవడంలో తేడా ఉండొచ్చు కానీ డ్రీమ్‌ ఎవరికైనా ఒకేలా ఉంటుంది. నెపోటిజం గురించి ఎవరు మాట్లాడతారో తెలుసు. ఇండస్ట్రీ నేపథ్యం ఉన్న వ్యక్తిగా నాకు మంచి లాంచ్‌ దొరికింది. వంద శాతం నేను అంగీకరిస్తున్నా. అది నాకు దక్కిన ప్రివిలేజ్‌గా భావిస్తున్నా. అయితే ఒకటి మాత్రం చెప్పగలను. సినీ నేపథ్యం ఉన్నంత మాత్రాన సెట్‌లోకి వెళ్లాక పని చేయకుండా కూర్చుంటే కుదరదు. నేనొక సినిమా అంగీకరించాను అంటే వంద శాతం ఎఫర్ట్‌ పెడతాను. దేనిని తలకు ఎక్కించుకోను. అహంకారానికి దూరంగా ఉంటా. నా రెండు కళ్లూ ఎప్పుడూ నేలనే చూస్తాయి. తల దించుకుని నా పని నేను చేసుకుంటూ వెళ్తా’’ అని సమాఽధానం చెప్పింది ఆలియాభట్‌.

Updated Date - 2023-05-12T12:28:55+05:30 IST