Alia Bhatt : కరణ్‌ షోలో ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-11-17T15:51:19+05:30 IST

బాలీవుడ్‌ కథానాయిక అలియా భట్‌ టాప్‌ సెలబ్రిటీ టాక్‌షో ‘కాఫీ విత్‌ కరణ్‌’ షోలో సందడి చేసింది. కరణ్‌ అడిగిన ర్యాపిడ్‌ ఫైర్‌లో ఆసక్తికర సమాధానాలు చెప్పింది. దీనికి సంబంధించిన వీడియో క్లిప్స్‌ నెట్టింట వైరల్‌గా మారాయి. తనపై వచ్చిన రూమర్స్‌పై అలియా స్పందించారు.

Alia Bhatt : కరణ్‌ షోలో ఆసక్తికర వ్యాఖ్యలు

బాలీవుడ్‌ కథానాయిక అలియా భట్‌ (Alia bhatt) టాప్‌ సెలబ్రిటీ టాక్‌షో ‘కాఫీ విత్‌ కరణ్‌’ (karan johar show) షోలో సందడి చేసింది. కరణ్‌ అడిగిన ర్యాపిడ్‌ ఫైర్‌లో ఆసక్తికర సమాధానాలు చెప్పింది. దీనికి సంబంధించిన వీడియో క్లిప్స్‌ నెట్టింట వైరల్‌గా మారాయి. తనపై వచ్చిన రూమర్స్‌పై అలియా స్పందించారు. "మనం ఉన్నది ఇంటర్‌నెట్‌ కాలంలో. ఎప్పుడూ ఏదో ఒక రూమర్స్‌ వస్తూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా సినీ సెలబ్రిటీల విషయంలో ఎక్కువగా వస్తుంటాయి. నేను స్లిమ్‌ అవ్వడానికి, చర్మాన్ని తెల్లగా మార్చుకోవడానికి పలు సర్జరీలు చేయించుకున్నానని ప్రచారం చేశారు. అంతే కాదు వ్యక్తిగత జీవితంలోకి వచ్చిన నానా రకాల మాటలు మాట్లాడారు. నా వైవాహిక జీవితంలో సమస్యలున్నాయంటూ రకరకాల రూమర్స్‌ను క్రియేట్‌ చేశారు. అవన్నీ అబద్దాలే. కానీ నేను రణ్‌బీర్‌కపూర్‌ ఎంత క్లోజ్‌ అనేది మాకు మాత్రమే తెలుసు. అలాంటి గాసిప్‌లు ఎన్ని వచ్చినా నేను అసలు పట్టించుకోను. దాని వల్ల నేను బాధపడను కూడా’’ అని తెలిపింది.

అంతే కాదు రణబీర్‌ (Ranbir kapoor) తనను వేదిస్తున్నాడంటూ వచ్చిన వార్తలపై కూడా అలియా స్పందించారు. గతంలో నేను ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రణ్‌బీర్‌కు లిప్‌స్టిక్‌ నచ్చదని, నేను వేసుకున్న వెంటనే తీసేయాలంటాడని చెప్పాను. ఆ విషయాన్ని అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు. అతడు నన్ను వేధిస్తున్నాడంటూ రకరకాల వార్తలు పుట్టుకొచ్చాయి. రణ్‌బీర్‌ మంచి వ్యక్తి. అందుకే ఇలాంటి వాటి గురించి ఆలోచించను. అసలు ప్రపంచం దృష్టి పెట్టాల్సిన విషయాను చాలా ఉన్నాయి. కానీ, ఇలాంటి విషయాలపై ఎక్కువ ఫోకస్‌ చేయడం బాధకలిగిస్తుంది’ అని అలియా చెప్పారు.

Updated Date - 2023-11-17T15:54:30+05:30 IST