Alia Bhatt: ఆలియా కోరిక.. నెటిజన్ల కౌంటర్‌ ఏంటో తెలుసా?

ABN , First Publish Date - 2023-07-24T18:37:26+05:30 IST

బాలీవుడ్‌ బ్యూటీ అలియాభట్‌ (Alia Bhatt) తన కూతురు ‘రాహా’ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తన లాగా సినిమా రంగాన్ని ఎంచుకొని, తన అడుగు జాడల్లో నడవాలని కోరుకోవడం లేదని’ చెబుతోంది. తన కుమార్తె భవిష్యత్తు గురించి ఓ క్లారిటీ ఉన్నట్లు తెలిపింది

Alia Bhatt: ఆలియా కోరిక.. నెటిజన్ల కౌంటర్‌ ఏంటో తెలుసా?

బాలీవుడ్‌ బ్యూటీ అలియాభట్‌ (Alia Bhatt) తన కూతురు ‘రాహా’ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తన లాగా సినిమా రంగాన్ని ఎంచుకొని, తన అడుగు జాడల్లో నడవాలని కోరుకోవడం లేదని’ చెబుతోంది. తన కుమార్తె భవిష్యత్తు గురించి ఓ క్లారిటీ ఉన్నట్లు తెలిపింది. . ‘రాకీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహానీ’ (bollywood) సినిమా ప్రచారంలో బిజీగా ఉన్న ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. ఇంతకీ తన కూతురు ఏం కావాలని కోరుకుంటుందో తెలుసా? ‘‘నా బిడ్డ గొప్ప గొప్ప పరిశోధనలు చేసి శాస్త్రవేత్త కావాలన్నది నా కోరిక’’ అని తెలిపింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. దీనికి పలువురు నెటిజన్లు ‘ఔను.. ఆలియా తనయ సినిమాలో శాస్త్రవేత్త అవుతుంది. కరణ్‌ జోహార్‌ ఆమె కోసం కథను సిద్థం చేశారు. తప్పక శాస్త్రవేత్తగా కనిపిస్తుంది’ అంటూ వ్యాఖ్యానించారు.

‘రాకీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహానీ’లో రణ్‌వీర్‌సింగ్‌కు జోడీగా కనిపించింది అలియా. ధర్మేంద్ర, షబానా ఆజ్మీ, జయా బచ్చన్‌ కీలక పాత్రధారులు. కరణ్‌ జోహార్‌ దర్శకత్వం వహించారు. రొమాంటిక్‌ డ్రామాగా రానున్న ఈ సినిమా జులై 28న విడుద?వుతోంది. ‘హార్ట్‌ ఆఫ్‌ స్టోన్‌’ చిత్రంతో హాలీవుడ్‌లో పరిచయం కానుంది ఆలియా.

Updated Date - 2023-07-24T18:37:26+05:30 IST