Akshay Kumar: 'ఓ మై గాడ్ 2' విడుదలకి అడ్డంకి, అభ్యంతరాలు తెలిపిన సెన్సార్, వాయిదా తప్పదా.. ?

ABN , First Publish Date - 2023-07-31T15:10:51+05:30 IST

అక్షయ్ కుమార్, పంకజ్ త్రిపాఠి, యామి గౌతమ్ నటించిన 'ఓ మై గాడ్ 2' సినిమా ఇబ్బందుల్లో పడింది అంటున్నారు. సెన్సార్ బోర్డు అక్షయ్ కుమార్ నటించిన పాత్ర, అలాగే ఇంకా కొన్ని సన్నివేశాలు తొలగించాలని చెప్పారని వార్తలు. అందువలన ఈ సినిమా ఆగస్టు 11న విడుదల కావాల్సి ఉండగా, వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

Akshay Kumar: 'ఓ మై గాడ్ 2' విడుదలకి అడ్డంకి, అభ్యంతరాలు తెలిపిన సెన్సార్, వాయిదా తప్పదా.. ?
Akshay Kumar as Lord Siva in Oh My God 2

అక్షయ్ కుమార్ (AkshayKumar) నటిస్తున్న 'ఓ మై గాడ్ 2' #OhMyGod2 సినిమా ఆగష్టు 11న విడుదలకి అన్ని సన్నాహాలు ఆ చిత్ర నిర్వాహకులు చేసుకున్నారు. అమిత్ రాయ్ (Amit Rai) దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదల వాయిదా పడే సూచనలు కనపడుతున్నాయి. #OMG2 ఎందుకంటే ఈ సినిమాకి సెన్సార్ బోర్డు కొన్ని అభ్యంతరాలు తెలిపినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా ట్రైలర్ కి సెన్సార్ U/A సర్టిఫికెట్ ఇచ్చింది, కానీ సినిమాకి అయితే మాత్రం చాలా అభ్యంతరాలు తెలిపింది అని అంటున్నారు.

ఈ సినిమా 'ఓ మై గాడ్' #OhMyGod అనే సినిమాకి సీక్వెల్. ఇందులో అక్షయ్ కుమార్, పంకజ్ త్రిపాఠి (PankajTripathi), యామి గౌతమ్ (YamiGautam) ప్రధాన పాత్రల్లో కనపడనున్నారు. అయితే ఇందులో అక్షయ్ కుమార్ శివుడి పాత్ర పోషిస్తున్నాడు, అయితే అదే పాత్రకి సెన్సార్ బోర్డు అభ్యంతరం తెలిపినట్టుగా వార్తలు వస్తున్నాయి. అదీ కాకుండా అందులో సుమారు ఒక 20 చోట్ల సెన్సార్ బోర్డు కట్స్ చెప్పిందని కూడా తెలుస్తోంది. ఇవన్నీ కలిపితే ఇప్పటికప్పుడు సినిమా మార్పులు చెయ్యడం సాధ్యం కాకపోవచ్చు కాబట్టి, ఆ సినిమా విడుదల వాయిదా వెయ్యడం మంచిదని ఆలోచిస్తున్నట్టుగా తెలిసింది.

Akshay-Kumar.jpg

సెన్సార్ బోర్డు చెప్పిన కట్స్ వలన సినిమాలో కథ దెబ్బ తింటుందని, చిత్ర నిర్వాహకులు ఏమి చెప్పదలచుకున్నారో అది సాధ్యం కాదని, అందువల్ల కట్స్ చెయ్యడం కూడా సరికాదని, దీనివల్ల సినిమా బాగా దెబ్బ తింటుందని నిర్వాహకులు అనుకుంటున్నారు. దీనికి వాయిదా వేసి మళ్ళీ అవి సరిచేసి ముందుకు రావటం మంచిదనే అభిప్రాయానికి వచ్చినట్టుగా కూడా తెలిసింది.

ఈ సినిమా 2012 లో వచ్చిన 'ఓ మై గాడ్' సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కింది. సెక్స్ ఎడ్యుకేషన్ మీద ఇది ఒక సెటైరికల్ కామెడీ సినిమాగా రూపొందుతున్న విషయం తెలిసిందే, దీన్ని వయాకామ్ 18 స్టూడియోస్ నిర్మాణ సంస్థ సుమారు రూ.150 కోట్ల భారీ బడ్జెట్లో నిర్మించింది. అయితే ఇప్పుడు సెన్సార్ అభ్యంతరాలు రావటంతో వాళ్ళు చెప్పిన కట్స్ చేసేసి సినిమా విడుదల చెయ్యాలా, లేకా మళ్ళీ కొన్ని సన్నివేశాలు రిషూట్ చెయ్యాలో అనే ఆలోచనలో చిత్ర టీం ఉందని తెలుస్తోంది. ఈ అక్షయ్ కుమార్ సినిమా ఇంకో నటుడు సన్నీ డియోల్ (SunnyDeol), అమీషా పటేల్ (AmeeshaPatel) సినిమా 'గదర్ 2' (Gadar2) తో పోటీ పడుతోంది. ఈ సినిమా కూడా ఆగష్టు 11 న విడుదలవుతోంది, రెండు సినిమాలు సీక్వెల్స్ కావటం ఆసక్తికరం.

Updated Date - 2023-07-31T15:10:51+05:30 IST