RIP Akhil Mishra : త్రీ ఇడియట్స్ నటుడు ఇకలేరు!
ABN, First Publish Date - 2023-09-21T13:46:48+05:30
బాలీవుడ్ చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. అమీర్‌ఖాన్ ‘త్రీ ఇడియట్స్’ (3 idiots) చిత్రంలో లైబ్రేరియన్ దుబే పాత్రతో మెప్పించిన ప్రముఖ నటుడు అఖిల్ మిశ్రా (58) గురువారం కన్నుమూశారు.
బాలీవుడ్ చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. అమీర్‌ఖాన్ ‘త్రీ ఇడియట్స్’ (3 idiots) చిత్రంలో లైబ్రేరియన్ దుబే పాత్రతో మెప్పించిన ప్రముఖ నటుడు అఖిల్ మిశ్రా (Akhil Mishra -58) గురువారం కన్నుమూశారు. వంట గది ఏదో పని చేస్తుండగా కాలు జారి పడిపోవడంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మరణించినట్లు బాలీవుడ్ మీడిమా నుంచి సమాచారం. ఆ సమయంలో ఆయన భార్య సుజానే ఓ షూట్ నిమిత్తం హైదరాబాద్‌లో ఉన్నారు. అఖిల్ మరణవార్త తెలుసుకున్న ఆమె షాక్‌కి గురయ్యారు. హుటాహుటిన హైదరాబాద్ నుంచి పయనమయ్యారు. ‘నా భాగస్వామి నన్ను వదిలేసి వెళ్లిపోయాడు, నా గుండె ముక్కలైంది’ అని కన్నీటి పర్యంతమవుతోంది.
సినీరంగంతోపాటు టీవీ రంగంలోనూ మంచి గుర్తింను తెచ్చుకున్న అఖిల్ మిశ్రా.. డాన్, వెల్‌డన్ అబ్బా, హజారన్ ఖ్వైషేన్ ఐసీ. శిఖర్ వంటి చిత్రాల్లో నటించారు. ‘ 3 ఇడియట్స్ సినిమాలో లైబ్రేరియన్‌గా నటించి జనాలకు మరింత చేరువయ్యారు. ఉత్తర ప్రదేశ్ కాన్పూర్‌లో జన్మించిన ఈయన 1983లో మంజు మిశ్రను పెళ్లి చేసుకున్నారు. ఆమె 1996లో మరణించింది. తర్వాత 2009లో జెర్మన్ కథనాయిక సుజానే బెర్నర్ట్‌ను పెళ్లాడారు మిశ్ర.