Pushpa 2: అల్లు అర్జున్ నిర్ణయం పట్ల అజయ్ దేవగన్ ఆశ్చర్యం, బాధపడ్డారు కానీ...

ABN , First Publish Date - 2023-09-12T13:00:13+05:30 IST

హిందీ సినిమా పరిశ్రమలో ఒక పెద్ద సినిమా విడుదలయినప్పుడు అక్కడ నిర్మాతలు, నటులు ఒకరితో ఒకరు మాట్లాడుకొని తమ సినిమాల విడుదల తేదీలు ప్రకటించుకున్నారు. అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' విడుదల తేదీ ఆగస్టు 15 అని అధికారిక ప్రకటన విడుదల చేసినప్పుడు, అదే తేదీకి అజయ్ దేవగన్ 'సింగం అగైన్' కూడా విడుదలవుతోంది. ఒకే రోజు రెండు పెద్ద సినిమాలు విడుదలైతే రెండు సినిమాల వ్యాపారం దెబ్బతింటుంది అందుకని...

Pushpa 2: అల్లు అర్జున్ నిర్ణయం పట్ల అజయ్ దేవగన్ ఆశ్చర్యం, బాధపడ్డారు కానీ...
Allu Arjun and Ajay Devgn

అల్లు అర్జున్ (AlluArjun), దర్శకుడు సుకుమార్ (Sukumar) కాంబినేషన్ లో వస్తున్న 'పుష్ప 2' #Pushpa2 విడుదల తేదీని నిన్న ప్రకటించారు. ఆగస్టు 15 (Agusut15) న విడుదల చేస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించి, పోస్టర్ కూడా విడుదల చేశారు. అయితే ముందుగా మార్చ్ 22, 2024 అనుకున్నట్టు సమాచారం కానీ ఆ సమయానికి సినిమా పూర్తవకపోవచ్చు అని, అందువల్ల హడావిడిగా విడుదల చెయ్యడం ఎందుకని వచ్చే సంవత్సరం ఆగస్టు 15న విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు.

అయితే అల్లు అర్జున్, సుకుమార్ ఈ తేదీ ప్రకటించగానే బాలీవుడ్ లో అజయ్ దేవగన్ (AjayDevgn) కొంచెం ఆశ్చర్యం వ్యక్తం చేశారు అని, తరువాత బాధపడ్డారు అని బాలీవుడ్ మీడియా రాస్తోంది. ఎందుకంటే అజయ్ దేవగన్, రోహిత్ శెట్టి (RohitShetty) కాంబినేషన్ లో వస్తున్న 'సింగం అగైన్' #SinghamAgain సినిమా ఆగస్టు 15న విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేసుకున్నారు. అయితే ఇప్పుడు 'పుష్ప 2' అదే తేదీకి ప్రకటించటంతో, అజయ్ దేవగన్ సినిమా ఇప్పుడు ఇంకో కొత్త తేదీకి వాయిదా వేసుకుంటున్నారు.

pushpatherule.jpg

అజయ్ దేవగన్, రోహిత్ శెట్టి సినిమాకి స్పెషల్ గా ఎక్కువ సెలవు రోజులుండే వీకెండ్ అవసరం లేదని, వాళ్ళది ఒక బ్రాండ్ అని, ఎప్పుడైనా విడుదల చేసుకోవచ్చు అని, కానీ 'పుష్ప 2' లాంటి సినిమాకి సెలవు రోజులు అవసరమని, అందుకే వాళ్ళ వ్యాపారం పోకుండా, అజయ్ దేవగన్ తన సినిమా 'సింగం అగైన్' వాయిదా వేసుకోనున్నట్టుగా బాలీవుడ్ మీడియా కథనాలు రాసింది.

అలాగే అల్లు అర్జున్ తన సినిమా 'పుష్ప 2' విడుదల తేదీ ప్రకటించే ముందు, అజయ్ దేవగన్ కి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడితో అసలు ఎటువంటి సమస్యలు వచ్చేవి కావని, ఆలా జరగకపోవటం అజయ్ దేవగన్ కొంచెం బాధపడినట్టుగా తెలిసింది. అయితే తమకి ఎటువంటి బేషజాలు లేవని, అందుకే 'పుష్ప 2' సినిమారోజే అజయ్ దేవగన్ సినిమా విడుదల కావాల్సి వున్నా, వాయిదా వేసుకుంటాం అని చెప్పినట్టుగా తెలిసింది.

ajaydevgn.jpg

ఇంకో ఆసక్తికరమైన అంశం ఏంటంటే, అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' ట్రైలర్ అజయ్ దేవగన్ లాంచ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. 'పుష్ప' హిందీ ట్రైలర్ ని అజయ్ లాంచ్ చేశారు అప్పట్లో. అప్పుడు అల్లు అర్జున్ అతనికి ట్విట్టర్ లో థాంక్స్ కూడా చెప్పారు.

Updated Date - 2023-09-12T13:00:18+05:30 IST