Dacoit: నేను ఏంటి? ఎక్సా? విలనా?.. స్ట‌న్నింగ్‌గా అడ‌వి శేష్‌,శృతి హ‌స‌న్ ‘డెకాయిట్‌’

ABN , Publish Date - Dec 20 , 2023 | 07:20 PM

గూడాచారి, మేజ‌ర్, హిట్ 2 చిత్రాల‌తో టాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్న న‌టుడు అడివి శేష్. వ‌రుస‌గా విల‌క్ష‌ణ చిత్రాలను చేస్తూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయ‌న కొత్త చిత్రం టైటిల్‌ టీజ‌ర్‌ను తాజాగా ఈ రోజు(బుధ‌వారం) విడుద‌ల చేయ‌గా ఈ సినిమాలో స‌మ్‌థింగ్ ఏదో ఉంది అనేలా ఉన్న‌ది.

Dacoit: నేను ఏంటి? ఎక్సా? విలనా?.. స్ట‌న్నింగ్‌గా అడ‌వి శేష్‌,శృతి హ‌స‌న్ ‘డెకాయిట్‌’
dacoit

గూడచారి, మేజ‌ర్, హిట్ 2 చిత్రాల‌తో టాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్న న‌టుడు అడివి శేష్(Adivi Sesh). వ‌రుస‌గా విల‌క్ష‌ణ చిత్రాలను చేస్తూ త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయ‌న హీరోగా ఇటీవ‌ల‌ శేష్ ఎక్స్ శృతి(Sesh EX Shruti) అనే కొత్త సినిమాను ఎనౌన్స్ చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ సినిమాతో షనియల్‌ డియో దర్శకుడిగా ప‌రిచ‌యం అవుతుండ‌గా శృతిహ‌స‌న్ (Shruti Haasan) క‌థానాయిక‌గా న‌టిస్తుంది. హిందీ, తెలుగు భాష‌ల్లో రూపొందుతున్న ఈ చిత్రం టైటిల్‌ టీజ‌ర్‌ను తాజాగా ఈ రోజు(బుధ‌వారం) విడుద‌ల చేయ‌గా ఈ సినిమాలో స‌మ్‌థింగ్ ఏదో ఉంది అనేలా ఉన్న‌ది.


ఇక విష‌యానికి వ‌స్తే.. ఈ సినిమాకు 'డెకాయిట్‌’(ఒక ప్రేమ కథ) (Dacoit) అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ టీజర్ విడుదల చేశారు. ఓ భారీ షూటౌట్ జరిగిన అనంత‌రం జూలియట్ ఎన్నేళ్లైంది మనం కలిసి అంటూ అడవి శేష్ (Adivi Sesh) చెప్పే డైలాగ్‌తో టీజర్ స్టార్ట్ అవ‌గా, కలిసి కాదు విడిపోయి అంటూ శ్రుతిహాసన్ (Shruti Haasan) చెప్పడం వంటి డైలాగ్స్‌తో పాటు ఒక‌రిపై ఒక‌రు గ‌న్స్ గురి పెట్టుకోని కాల్చుకునే స‌న్నివేశాలతో ముగించారు. ఈ సీన్స్‌ చాలా ఆస‌క్తిక‌రంగా ఉన్నాయి. మీరూ ఓ లుక్కేయండి.

Updated Date - Dec 20 , 2023 | 07:20 PM