Aditya Roy Kapur : అలా అడగకండి... అబద్ధాలే చెబుతా!

ABN , First Publish Date - 2023-12-12T14:14:10+05:30 IST

బాలీవుడ్‌ హీరోయిన్‌ అనన్య పాండే(Ananya panday), ఆదిత్యరాయ్‌ కపూర్‌ (Aditya Roy Kapur), మధ్య ప్రేమ వ్యవహారం గురించి చాలా రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే! అయితే ఈ జంట తమ  ప్రేమ వ్యవహారాన్ని బయట చెప్పలేదు

Aditya Roy Kapur : అలా అడగకండి... అబద్ధాలే చెబుతా!

బాలీవుడ్‌ హీరోయిన్‌ అనన్య పాండే(Ananya panday), ఆదిత్యరాయ్‌ కపూర్‌ (Aditya Roy Kapur), మధ్య ప్రేమ వ్యవహారం గురించి చాలా రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే! అయితే ఈ జంట తమ  ప్రేమ వ్యవహారాన్ని బయట చెప్పలేదు కానీ.. ఇండస్ట్రీలో ఏ పార్టీ జరిగినా ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని హాజరవుతున్నారు. ఇటీవల జరిగిన దీపావళి పార్టీలోనూ వీళ్లిద్దరూ మెరిశారు. దీంతో ఈ రూమర్లు ఎక్కువయ్యాయి. ఈ విషయంపై కాఫీ విత్‌ కరణ్‌ సీజన్‌ 8లో ఆదిత్యాను కరణ్‌ జోహార్‌ ప్రశ్నించారు. తాజాగా ఈ ప్రోమోను విడుదల చేశారు.

‘అనన్యతో నువ్వు డేటింగ్‌లో ఉన్నారని రూమర్స్‌ వస్తున్నాయి. నువ్వు చెబుతావోనని అందరూ ఆతురతగా ఎదురచూస్తున్నారు’’ అని కరణ్‌ అడిగారు. దీంతో ‘మీరు నన్ను రహస్యాలు అడగొద్దు.. నేను కచ్చితంగా అబద్థాలే చెబుతాను. దయచేసి మరో ప్రశ్న అడగండి’ అంటూ ఆదిత్య సరదాగా స్పందించారు. గత నెల జరిగిన ఎపిసోడ్‌లో అనన్యా పాల్గొని సందడి చేసింది. ఇక ఆదిత్య, అనన్య ఇద్దరూ సినిమాలతో బిజీగా ఉన్నారు. 

Updated Date - 2023-12-12T14:14:12+05:30 IST