PavitraNaresh: త్వరలోనే వివాహం.. లిప్‌లాక్‌తో క్లారిటీ

ABN , First Publish Date - 2022-12-31T13:24:39+05:30 IST

సీనియర్ నరేష్ (Naresh), పవిత్ర (Pavitra)లపై ఈ మధ్య ఏ స్థాయిలో వార్తలు వైరల్ అయ్యాయో తెలియంది కాదు. అయితే వారి బంధంపై సోషల్ మీడియా వేదికగా..

PavitraNaresh: త్వరలోనే వివాహం.. లిప్‌లాక్‌తో క్లారిటీ
Pavitra and Naresh

సీనియర్ నరేష్ (Naresh), పవిత్ర (Pavitra)లపై ఈ మధ్య ఏ స్థాయిలో వార్తలు వైరల్ అయ్యాయో తెలియంది కాదు. అయితే వారి బంధంపై సోషల్ మీడియా వేదికగా నరేష్ క్లారిటీ ఇచ్చేశారు. త్వరలోనే మేము వివాహబంధంతో ఒక్కటి కాబోతున్నామని నరేష్ ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. అంతేకాదు.. ఈ మూమెంట్‌ని వారు సెలబ్రేట్ చేసుకుంటున్నట్లుగా చూపిస్తూ.. ఇద్దరూ లిప్‌లాక్ చేసుకుంటున్న వీడియోని నరేష్ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై రకరకాలుగా చర్చలు నడుస్తున్నాయి. (Naresh and Pavitra Marriage)

‘‘న్యూ ఇయర్, న్యూ బిగినింగ్స్, మా ఇద్దరికీ మీ ఆశీస్సులు కావాలి. నూతన సంవత్సర శుభాకాంక్షలు.. మీ పవిత్రనరేష్’’ అంటూ నరేష్ ఓ వీడియోని ట్వీట్ చేశారు. ఈ వీడియోలో ఇద్దరూ కలిసి కేక్ కట్ చేయడమే కాకుండా.. గాఢ చుంబనంతో అందరికీ షాకిచ్చారు. ఈ లిప్‌లాక్‌తో వారిద్దరూ వార్తలలో హైలెట్ అవుతున్నారు. గత కొంతకాలంగా వీరిద్దరూ కలిసే ఉంటున్నారు. రీసెంట్‌గా విడుదలైన ‘అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి’ సినిమా ప్రమోషన్స్ టైమ్‌లో.. అలాగే సూపర్ స్టార్ కృష్ణ మృతి చెందిన సమయంలో వీరిద్దరూ చేసిన హడావుడి అంతా కాదు. ఆ తర్వాత కూడా.. అసభ్యకరంగా మాపై రాస్తున్నారంటూ.. యూట్యూబ్, వెబ్ సైట్స్‌పై కేసులు కూడా ఫైల్ చేయించారు. ఆ కేసులు అలా నడుస్తుండగానే.. న్యూ ఇయర్ స్పెషల్‌గా వారి బంధాన్ని ఇంకో అడుగు ముందుకు తీసుకెళుతున్నట్లుగా నరేష్ ప్రకటించాడు. ఇది నరేష్‌కి నాలుగో పెళ్లి. ఈ పెళ్లితో పవిత్ర లోకేష్ కాస్తా.. పవిత్ర నరేష్‌గా మారుతోంది. (Year End Twist From Naresh)

Updated Date - 2022-12-31T16:06:51+05:30 IST

Read more