సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

NareshPavitra: పవిత్ర కంటే ముందు.. నరేష్ 3 పెళ్లిళ్ల కథ ఇదే!

ABN, First Publish Date - 2022-12-31T15:19:16+05:30

కామెడీ సినిమాలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నరేష్ (VK Naresh).. అప్పట్లో హీరోగానూ కొన్ని సినిమాలలో నటించారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారి బిజీ బిజీగా మారిపోయారు. ఇప్పటి వరకు ఎన్నో చిత్రాలలో..

Naresh and Pavitra
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామెడీ సినిమాలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నరేష్ (VK Naresh).. అప్పట్లో హీరోగానూ కొన్ని సినిమాలలో నటించారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారి బిజీ బిజీగా మారిపోయారు. ఇప్పటి వరకు ఎన్నో చిత్రాలలో నటించి.. నటుడిగా తిరుగులేని క్రేజ్‌ని సంపాదించుకున్న నరేష్ (Naresh).. పర్సనల్ లైఫ్‌ విషయంలో మాత్రం ఎప్పుడూ ఏదో ఒక విషయంతో వార్తలలో నిలుస్తూనే ఉన్నారు. ముఖ్యంగా పెళ్లిళ్ల విషయంలో నరేష్ పేరు ఈ మధ్య వార్తలలో బాగా వినబడుతోంది. నటి పవిత్ర (Pavitra)తో నరేష్ సహజీవనం చేస్తున్నారని.. త్వరలోనే వారిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారనేలా వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో.. న్యూ ఇయర్ స్పెషల్‌గా ఆ వార్తలకు నరేష్ ఫుల్‌స్టాప్ పెట్టేశారు. త్వరలోనే పవిత్రను పెళ్లి చేసుకోబోతున్నానని అధికారికంగా నరేష్ ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. పవిత్ర‌తో కలిసి కేక్ కట్ చేస్తూ.. ఇద్దరూ లిప్‌లాక్ చేసుకుంటున్న వీడియోని షేర్ చేసి.. నూతన సంవత్సరంలో మీ ఆశీస్సులు మాకు కావాలని కోరారు. దీంతో నరేష్ నాలుగో పెళ్లి (4th Marriage)కి సిద్ధమైనట్లుగా క్లారిటీ వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఇంతకు ముందు నరేష్ పెళ్లి చేసుకున్న వారి వివరాల్లోకి వెళితే..

ఇప్పటి వరకు నరేష్‌కు మూడు వివాహాలు జరిగాయి. ఈ ముగ్గురికీ మంచి బ్యాక్‌గ్రౌండే ఉంది. నరేష్ టీనేజ్‌లో ఉండగా.. డ్యాన్స్ మాస్టర్ శ్రీను (Srinu Daughter) కుమార్తెను పెళ్లి (Naresh 1st Marriage) చేసుకున్నారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఇద్దరూ విడిపోయారు. వీరి కుమారుడే నవీన్ విజయ్ కృష్ణ (‘నందిని నర్సింగ్ హోమ్’ చిత్ర హీరో) (Naveen Vijaya Krishna). ఆమెతో విడిపోయిన తర్వాత నరేష్ మళ్లీ రెండో పెళ్లి చేసుకున్నాడు.

ప్రముఖ నవలా రచయిత, దేవులపల్లి కృష్ణశాస్త్రి (Devulapalli Krishna Shastry)గారి మనవరాలైన రేఖా సుప్రియ (Rekha Supriya) (బుజ్జాయి నవలా రచయిత)ను నరేష్ రెండో వివాహం (Naresh Second Marriage) చేసుకున్నాడు. అయితే ఆమెతోనూ ఎక్కువకాలం నరేష్ కలిసి జీవించలేకపోయాడు. వీరిద్దరి మధ్య కూడా మనస్పర్థలు రావడం, తర్వాత విడిపోవడం జరిగింది. వీరిద్దరికీ ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు తేజ (Teja). నరేష్, రేఖా సుప్రియ విడిపోయినప్పటికీ ఓ NGO కోసం ఇప్పటికీ వారిద్దరూ కలిసి పనిచేస్తున్నట్లుగా సమాచారం.

అనంతరం నరేష్ 50 ఏళ్ల వయసులో.. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైన రఘువీరారెడ్డి (Raghuveera Reddy) సోదరుడి కుమార్తె రమ్య రఘుపతి (Ramya Raghupathi)ని 2010లో వివాహం (Naresh 3rd Marriage) చేసుకున్నాడు. వీరికి కూడా ఓ బాబు పుట్టాడు. రీసెంట్‌గా వీరిద్దరి మధ్య కూడా మనస్పర్థలు రావడమే కాకుండా.. భారీ స్థాయిలో గొడవలు కూడా జరిగాయి. అందుకు కారణం పవిత్ర అనేది తెలియంది కాదు. ఓ హోటల్‌లో నరేష్, పవిత్ర ఉండగా.. రమ్య రఘుపతి మీడియాతో సహా వెళ్లి వారిపై దాడి చేసింది. దీంతో ఇదో పెద్ద వివాదంగా నడుస్తూ వస్తుంది. అంతకు ముందు నుంచే నరేష్, రమ్యల మధ్య గొడవలు జరుగుతున్నట్లుగా రమ్య పలు ఇంటర్వ్యూలలో కూడా చెప్పుకొచ్చింది. ఇప్పుడు నరేష్ తాజా ప్రకటనతో.. ఆ వివాదానికి కూడా తెరపడినట్లే భావించాలి.

షష్ఠి పూర్తి అనంతరం నాలుగో పెళ్లి

మూడు వివాహాల అనంతరం.. ఇప్పుడు నటి పవిత్రతో నరేష్ నాలుగో పెళ్లి (Naresh 4th Marriage)కి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం అతని వయసు 62 సంవత్సరాలు. అంటే, షష్టి పూర్తి అనంతరం నరేష్ నాలుగో పెళ్లి చేసుకోబోతున్నారు. అంతే కాదు తనకంటే దాదాపు 20 సంవత్సరాల వయసు తక్కువైన పవిత్ర (43) (Pavitra)ను ఆయన వివాహం చేసుకోబోతున్నారు. ఆమెకు కూడా ఇది రెండో వివాహం. అంతకు ముందు సుచేంద్ర ప్రసాద్ (Suchendra Prasad) అనే వ్యక్తిని ఆమె వివాహం చేసుకుంది. సుచేంద్ర, పవిత్రలకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఒక బాబు, ఒక పాప. మొదటి భర్తతో మనస్పర్థలు రావడంతో.. కొంతకాలంగా ఆయనకు పవిత్ర దూరంగా ఉంటూ.. నరేష్‌తో రిలేషన్‌ను కొనసాగిస్తోంది. ఇప్పుడా రిలేషన్‌ను నరేష్, పవిత్రలు పెళ్లి దిశగా తీసుకెళ్లబోతున్నారు.

Updated Date - 2022-12-31T15:19:23+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!