సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Vijay Kirgandur: సలార్ కబుర్లు చెప్పిన నిర్మాత

ABN, First Publish Date - 2022-12-24T17:59:30+05:30

‘బాహుబలి’ (Baahubali) ప్రాంచైజీతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న నటుడు ప్రభాస్ (Prabhas). ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ‘సలార్’ (Salaar), ‘ప్రాజెక్ట్ కె’ వంటి వైవిధ్యమైన మూవీ షూటింగ్స్‌లో పాల్గొంటున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాహుబలి’ (Baahubali) ప్రాంచైజీతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న నటుడు ప్రభాస్ (Prabhas). ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ‘సలార్’ (Salaar), ‘ప్రాజెక్ట్ కె’ వంటి వైవిధ్యమైన మూవీ షూటింగ్స్‌లో పాల్గొంటున్నాడు. ‘కెజియఫ్’ ను తెరకెక్కించిన ప్రశాంత్ నీల్.. ‘సలార్’ కు దర్శకత్వం వహిస్తుండటంతో ఈ సినిమాపై భారీ బజ్ ఉంది. ‘సలార్’ ను హోంబలే ఫిలిమ్స్ భారీ బడ్జెట్‌తో రూపొందిస్తుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఆ సంస్థ అధినేత విజయ్ కిరంగదూర్ మీడియాతో పంచుకున్నాడు.

సలార్ సినిమా షూటింగ్ 85శాతానికి పైగా పూర్తయిందని విజయ్ కిరంగదూర్ చెప్పాడు. మిగిలిన భాగాన్ని జనవరి లోగా పూర్తి చేస్తామని తెలిపాడు. ‘‘అవుట్ అండ్ అవుట్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా సలార్ రూపొందుతుంది. మూవీ రషెస్ చూశాను. చాలా బాగా వచ్చింది. ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ అద్భుతంగా నటించారు. చిత్రాన్ని జనవరిలోగా పూర్తి చేస్తాం. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కోసం ఆరు నెలలు కేటాయించాం. విజువల్ ఎఫెక్ట్స్‌ను పూర్తి చేసి ఈ మూవీని వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న విడుదల చేస్తాం’’ అని విజయ్ కిరంగదూర్ తెలిపాడు. సినిమాలపై వచ్చే ఐదేళ్లలో రూ.3వేల కోట్లను ఖర్చు చేస్తామన్నారు. ప్రతి ఏడాది ఒక్క భారీ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామన్నారు. ఇక ప్రభాస్ కెరీర్ విషయానికి వస్తే.. ఆదిపురుష్ మూవీ షూటింగ్‌ను గతంలోనే పూర్తి చేశాడు. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కావాలి. విజువల్ ఎఫెక్ట్స్ వల్ల చిత్రం ఆలస్యం అయింది. అందువల్ల జూన్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామన్నారు. ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కె’ చిత్రాలు పూర్తి కాకుండానే మారుతి దర్శకత్వంలో నటించడానికి అంగీకరించాడు. రాజా డీలక్స్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ మూవీలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.

Updated Date - 2022-12-24T17:59:31+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!