Vijay Deverakonda: దేవరశాంటా.. ఈసారి సర్‌ప్రైజింగ్ గిఫ్ట్

ABN , First Publish Date - 2022-12-26T12:50:06+05:30 IST

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda).. న్యూ ఇయర్‌ను పురస్కరించుకుని గత ఐదేళ్లుగా ‘దేవరశాంటా’ (Deverasanta) పేరుతో సర్‌ప్రైజ్ బహుమతులు..

Vijay Deverakonda: దేవరశాంటా.. ఈసారి సర్‌ప్రైజింగ్ గిఫ్ట్
Hero Vijay Deverakonda

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda).. న్యూ ఇయర్‌ను పురస్కరించుకుని గత ఐదేళ్లుగా ‘దేవరశాంటా’ (Deverasanta) పేరుతో సర్‌ప్రైజ్ బహుమతులు ఇస్తూ.. ఛారిటీ కార్యక్రమాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ప్రపంచంలో ఏ హీరో చేయని విధంగా తన అభిమానులకు.. ఒక్కో సంవత్సరం ఒక్కో బహుమతి (Gift) ఇస్తూ సర్‌ప్రైజ్ చేస్తున్నాడు. ఈ ఏడాది కూడా మరో సరికొత్త ఆలోచనతో దేవరశాంటాగా ముందుకొచ్చారు విజయ్ దేవరకొండ. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

ఈసారి ఆయన ఇచ్చే సర్‌ప్రైజింగ్ గిఫ్ట్ ఏమిటంటే.. 100 మంది అభిమానులను ఫ్రీ హాలీడే టూర్‌కు పంపించబోతున్నారు. దేవరశాంటా యాష్ ట్యాగ్ పేరుతో తనకు వచ్చిన రిక్వెస్టుల నుంచి వందమంది అభిమానులను ఎంపికచేసి పూర్తి ఖర్చులు తానే భరించి వెకేషన్ పంపించబోతున్నారు. ఇందుకు నాలుగు ఆప్షన్స్ విజయ్ సూచించారు. మౌంటెయిన్స్ ఆఫ్ ఇండియా (Mountains of India), బీచెస్ ఆఫ్ ఇండియా (Beaches of India), కల్చర్ ట్రిప్ ఆఫ్ ఇండియా (Culture Trip of India), డిసెర్ట్స్ ఇన్ ఇండియా (Desert in India)... ఇలా ఈ నాలుగు ఆప్షన్స్‌లో ఎక్కడికి టూర్‌కు వెళ్లాలన్నా.. విజయ్ దేవరకొండ పూర్తిగా ఉచితంగా పంపించబోతున్నారు. ఇప్పటిదాకా ప్రపంచంలో ఏ హీరో తన అభిమానులను ఇలా ఫ్రీ హాలీడే ట్రిప్‌కు పంపించలేదు. సెలవుల్లో ఏదైనా టూర్‌కు వెళ్లాలనుకుని ఖర్చులకు సందేహించే అభిమానులు దేవరశాంటా ఆలోచనను ప్రశంసిస్తున్నారు. ఈ నిర్ణయంతో ట్విట్టర్ వేదికగా అభినందిస్తూ.. నెటిజన్లు, అభిమానులు విజయ్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నారు.

Updated Date - 2022-12-26T19:15:00+05:30 IST