NTR30: హీరోయిన్ రేసులో ఇద్దరు అందాల భామలు!
ABN , First Publish Date - 2022-12-15T16:25:05+05:30 IST
‘ఆర్ఆర్ఆర్’ తో దేశ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు చేరువైన నటుడు జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR). ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో తన తర్వాతి ప్రాజెక్టు అంతకు మించి ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు.

‘ఆర్ఆర్ఆర్’ తో దేశ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు చేరువైన నటుడు జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR). ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో తన తర్వాతి ప్రాజెక్టు అంతకు మించి ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. టాప్ డైరెక్టర్ కొరటాల్ శివ (Koratala Siva) దర్శకత్వంలో నటించడానికి ఒకే చెప్పాడు. యువసుధా ఆర్ట్స్ ఈ సినిమాను నిర్మించనుంది. ఈ ప్రాజెక్టు వర్కింగ్ టైటిల్‌గా ‘ఎన్‌టీఆర్30’ (NTR30) అని వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌ను ఇప్పటి వరకు ఎంపిక చేయలేదు. కథానాయిక ఛాన్స్ కోసం ఇద్దరు అందాల భామలు పోటీపడుతున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు తెలుపుతున్నాయి.
బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) కు మేకర్స్ కథను వినిపించగా అంగీకారం తెలిపిందని సమాచారం. కానీ, కాంట్రాక్ట్‌పై సంతకం చేయలేదని తెలుస్తోంది. డేట్స్ అందుబాటును బట్టి సైన్ చేయనుందట. ఒకవేళ ఆమె కనుక ప్రాజెక్టుకు సంతకం చేస్తే టాలీవుడ్ ఇండస్ట్రీకి ఘనంగా స్వాగతం చెప్పాలని చిత్రబృందం ఆలోచిస్తుందట. అనివార్య కారణాల వల్ల జాన్వీ నటించలేకపోతే రష్మిక మందన్నా(Rashmika Mandanna) వైపు మేకర్స్ చూస్తున్నారట. ‘ఎన్‌టీఆర్30’ అండర్ వాటర్ యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతుంది. పాన్ ఇండియాగా తెరకెక్కుతుంది. సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నాడు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం కొన్ని నెలల క్రితమే పట్టాలెక్కాలి. కానీ, కొరటాల రూపొందించిన స్క్రిఫ్ట్‌తో తారక్ సంతృప్తి చెందలేదు. మార్పులు, చేర్పులు సూచించాడు. ఈ మధ్యనే షూటింగ్‌కు రెడీ అన్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్‌లో జరుగుతుంది. జనవరిలో పూజా కార్యక్రమాలు చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు. ఫిబ్రవరి నుంచి షూటింగ్ ప్రారంభించనున్నారని ఫిల్మ్ నగర్ వర్గాలు తెలుపుతున్నాయి.